Kumbha Rasi Phalalu 2026 : కుంభ రాశి వారికి ఈ ఏడాది ఏమాత్రం అనుకూలంగా లేదు.. ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే ఇక అంతే..!
Kumbha Rasi Phalalu 2026 : ఉగాది నుంచి అస్సలు కలిసి రాని రాశి ఏదైనా ఉందంటే అది కుంభ రాశే అంటున్నారు పండితులు
- Dharani Pilli
- Published On : March 16, 2026 / 09:24 PM IST
Parabhava nama samvatsara ugadi panchangam 2026 kumbha rasi phalalu Aquarius horoscope
Kumbha Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో ఏమాత్రం అనుకూలంగా లేని రాశి.. 12 రాశుల్లో అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న రాశి కుంభ రాశి అని పండితులు చెబుతున్నారు. రాహువు జన్మ రాశిలో ఉండటం వల్ల కుంభ రాశి వారిలో అహంకారం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తమ మీద తాము నియంత్రణ కోల్పోవడంతో ఇతరులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడి తర్వాత బాధపడతారు, అందుకే మాట పొదుపు చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.
ఆర్థికం – ఆరోగ్యం
ఈ ఏడాది కుంభ రాశి వారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తారు. జూన్ నుండి అక్టోబర్ వరకు గురుడు 6వ స్థానంలో ఉండటం వల్ల అప్పుల పాలయ్యే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. కుంభ రాశి వారి మీద ఏలినాటి శని ప్రభావం వల్ల జూన్ నుంచి ఐదు నెలలు చాలా కష్టంగా గడుస్తాయంటున్నారు. ముఖ్యంగా యువతీ యువకులు రిలేషన్‌షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు, కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించాలి.
ఆదాయం: 2 వ్యయం: 8 రాజపూజ్యం: 4 అవమానం: 2
అనుకూల సమయం
నవంబర్, డిసెంబర్, జనవరి నెలలు కొంత అదృష్టాన్ని కలిగిస్తాయి. ఈ సమయంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు.
పరిహారాలు
- మయూర మాల: ఈ సంవత్సరం మయూర మాలను ధరించడం చాలా శ్రేయస్కరం.
- బగళాముఖి పూజ: వరుసగా ఐదు నెలల పాటు అమావాస్య రోజుల్లో బగళాముఖి పూజకు హాజరవ్వడం వల్ల నెగిటివిటీ తగ్గుతుంది.
- దైవ దర్శనం: ఉజ్జైని మహాకాళేశ్వరుడిని దర్శించుకోవడం, హరసిద్ధి మాత ఆలయంలో 108 ప్రదక్షిణలు చేయడం వల్ల మేలు జరుగుతుంది.
- నిత్య పూజ: ప్రవాళ గణపతిని నిత్యం పూజించడం మరియు గణపతి అనుగ్రహం పొందడం మంచిది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.
