Makara Rasi Phalalu 2026 : మకర రాశి వారు ఇక ఊపిరి పీల్చుకోండి.. ఏడేళ్ల కష్టాలు తీరినట్లే.. ఇక మీరు చెప్పిందే వేదం..!
Makara Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని అంటున్నారు పండితులు.
- Dharani Pilli
- Published On : March 16, 2026 / 05:04 PM IST
Parabhava nama samvatsara ugadi panchangam 2026 makara rasi phalalu Capricorn horoscope
Makara Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో అత్యంత అదృష్టవంతులైన రాశులలో మకర రాశి కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గత ఏడేళ్ల నుంచి వీరు అనుభవించిన కష్టాలన్నీ ఇప్పుడు తొలగిపోతాయని.. ఈ ఏడాది నుంచి వీరికి అదృష్టం పట్టబోతుందని.. ఇకపై మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితులు మారబోతున్నాయని అంటున్నారు. అయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయని.. దీని వల్ల మకర రాశి వారు అప్పుల పాలయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8 రాజపూజ్యం 1 అవమానం 2గా ఉండబోతుందని తెలిపారు.
అనుకూల సమయం:
మకర రాశి వారికి 2026 జూన్ 1వ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు గురువు 7వ స్థానంలో ఉండటం వల్ల ఇది చాలా మంచి సమయం అంటున్నారు. వివాహం, వ్యాపారాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయమని.. వారు పట్టిందల్లా బంగారం అవుతుందంటున్నారు.
జాగ్రత్త పడాల్సిన సమయం:
మకర రాశి వారు అక్టోబర్ 31 తర్వాత అష్టమ గురువు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో నిదానంగా ఉండాలని సూచిస్తున్నారు.
పరిహారాలు:
- దుర్గాదేవి ఆరాధన: ప్రతి మంగళవారం రాహుకాలంలో (మధ్యాహ్నం 3:00 – 4:30) దుర్గాదేవి ఆలయానికి వెళ్లి 11 నిమ్మకాయ దీపాలు వెలిగించి, ఖడ్గమాల స్తోత్రం చదువుకోవాలి.
- శ్రీ మహాలక్ష్మి యాగం: అక్షయ తృతీయ రోజున ఈ యాగం చేసుకోవడం వల్ల యోగ సిద్ధి కలుగుతుంది.
- రుణ విముక్తి మాల: పగడాల మాలను ధరించడం మరియు ప్రవాళ గణపతిని నిత్యం పూజించడం వల్ల మేలు జరుగుతుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.
