Meena rasi phalalu 2026 : మీన రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం.. అయినా బ్రహ్మాండమైన ఆదాయం.. ఆ మూడు నెలల్లో అదృష్టం..!

Meena rasi phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది.. ఆదాయ, వ్యయాల వివరాలు..

parabhava nama samvatsara ugadi panchangam 2026 meena rasi phalalu Pisces horoscope

Meena rasi phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. అద్భుతాలేం జరగవు కానీ.. మరీ దారుణమైన పరిస్థితులు కూడా ఎదురవ్వవని పండితులు చెబుతున్నారు. మీన రాశి వారు ప్రస్తుతం ఏలినాటి శని దశలో ఉన్నారు కాబట్టి.. దీని వల్ల వారి మీద కొంత మానసిక ఒత్తిడి, దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు తలెత్తుతాయంటున్నారు. అయితే, జూన్ నుండి తొమ్మిది నెలల పాటు గురు గ్రహం మీన రాశి వారిని రక్షిస్తుందని.. దీని వల్ల కొంత ప్రశాంతత లభిస్తుందంటున్నారు.

ఉగాది తర్వాత నుంచి మీన రాశి వారికి ఆదాయం బాగుంటుంది. ప్రతి రూపాయి కూడా లాభదాయకమైన పనులకే ఖర్చు చేస్తారంటున్నారు పండితులు. జూన్ 1 నుండి అక్టోబర్ వరకు భూములు, ఆస్తులు కొనడానికి, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. ఈ సంవత్సరం మీన రాశి వారికి పంచమ గురువు వల్ల సంతానం ద్వారా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, వారికి మంచి జరుగుతుందంటున్నారు.

పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 7, అపమానం:2 గా ఉండబోతుందంటున్నారు.

జాగ్రత్త పడాల్సిన సమయం:
మీన రాశి వారికి 2026 ఏడాదిలో నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో గురుడు 6వ స్థానంలో ఉండటం వల్ల మోసపోయే అవకాశం ఉందని, అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

జీవనశైలి:
క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలి. యోగా, ధ్యానం చేయడం మంచిది. మొబైల్ ఫోన్లకు, అనవసరపు చర్చలకు దూరంగా ఉండి సంపాదనపై దృష్టి పెట్టాలని పండితులు సూచిస్తున్నారు.

చట్టపరమైన అంశాలు:
ఈ సంవత్సరం మీన రాశి వారు లీగల్ సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉన్నందున, ఏ పని చేసినా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. ఈజీ మనీ వైపు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.

పరిహారాలు:

మంచి జరగడం కోసం మీన రాశి వారు మయూర మాలను ధరించడం మంచిది అంటున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.