Saturn Transit 2026 : శని సంచారం.. రానున్న 5 నెలలు ఈ 6 రాశుల వారికి గొప్ప యోగం.. ఇక వీరిని ఆపే వారే లేరు.. !
Saturn Transit 2026 : మే నెలలో శని సంచారం ప్రారంభం కాబోతుంది. 5 నెలల పాటు కొనసాగనుంది. ఫలితంగా 6 రాశుల వారు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు
- Dharani Pilli
- Updated on- May 9, 2026 / 09:54 PM IST
saturn transit in revati nakshatra 2026 these six zodiac signs may get rid of financial problems and career growth
Saturn Transit 2026 : జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడి సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. కర్మ ఫలదాత అయిన శని దేవుడి సంచారం వల్లే ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే చాలా వరకు శని సంచారం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అంటారు. కానీ కొన్ని సార్లు శని సంచారం కొన్ని రాశుల వారికి అపార సిరి సంపదలను కలిగిస్తుంది. అలాంటి యోగం త్వరలోనే ఏర్పడబోతుంది. మే 17వ తేదీన శని తన మిత్రుడైన బుధుడికి చెందిన రేవతి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అక్టోబర్ 8వ తేదీ వరకు శని ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. ఈ ఐదు నెలల కాలం బుధుడు ఆరు రాశుల వారిపై అనుకూల ప్రభావం చూపి వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతున్నాడు.
ముఖ్యంగా మే 16న వచ్చే ‘శని అమావాస్య’ తర్వాత నుంచి ఈ క్రింది 6 రాశుల వారి దశ తిరగబోతోందని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంతకు ఆ ఆరు రాశులు ఏవంటే..
1. వృషభ రాశి:
శని సంచారం వల్ల అద్భుత ఫలితాలు చూసే రాశుల్లో వృషభ రాశి ఉంది. మే 17 నుంచి ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలగనుంది. రేవతి నక్షత్రంలో శని సంచారం వృషభ రాశి వారికి అద్భుతమైన ఆర్థిక వెసులుబాటును కలిగిస్తుంది.
- ఆదాయం: దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. షేర్ మార్కెట్, పెట్టుబడుల ద్వారా లాభాలు అందుతాయి.
- కుటుంబం: ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
2. మిథున రాశి:
మిథున రాశి అధిపతి బుధుడు కావడంతో, రేవతి నక్షత్ర సంచారం వీరికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
- కెరీర్: ఉద్యోగస్తులకు ఆశించిన గౌరవం దక్కుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూల సమయం.
- పరిష్కారాలు: కోర్టు కేసులు, చట్టపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
3. సింహ రాశి:
మే 17 నుంచి సింహ రాశి వారికి అష్టమ శని ప్రభావం తగ్గుముఖం పట్టనుంది.
- వ్యాపారం: మే 17 తర్వాత వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఆదాయ వనరులు పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.
- జీవితం: ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గి.. జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి. వృత్తి పరంగా మీ మాటకు విలువ పెరుగుతుంది.
4. కన్యా రాశి:
కన్యా రాశి వారికి మే 17 నుంచి రానున్న 5 నెలల పాటు గోల్డెన్ పీరియడ్. ఈ కాలం కెరీర్ పరంగా అత్యంత అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.
ఉద్యోగం: నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉంది. లేదా విదేశాల్లో జాబ్ దక్కించుకుంటారు.
అభివృద్ధి: వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మరియు ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి.
5. తులా రాశి:
శని సంచారం వల్ల మే 17 నుంచి అక్టోబర్ నెల వరకు తులా రాశి వారి జీవితం అత్యంత సాఫీగా సాగిపోతుంది. అదృష్ట కాలం ప్రారంభం అవుతుంది.
- ధన లాభం: ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం నూటికి నూరు శాతం విజయం సాధిస్తుంది.
- గౌరవం: సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. సంతానం సాధించే విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి.
6. ధనుస్సు రాశి:
అర్ధాష్టమ శని దోషం ఉన్న ధనుస్సు రాశి వారికి, శని రేవతి నక్షత్ర ప్రవేశం పెద్ద ఊరట. అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది.
- విజయం: నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
- స్థాయి: సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి విముక్తి పొంది ఆర్థికంగా బలోపేతం అవుతారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్థారించడం లేదు.
