Education Horoscope 2026 : ఉగాది నుంచి ఈ రాశి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి.. ఈ మంత్రం జపిస్తే.. అనుకున్న ఫలితాలు సాధిస్తారు..!

Education Horoscope 2026 : 2026 సంవత్సరంలో 12 రాశుల విద్యార్థులకు ఎలా ఉండబోతుంది.. వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారా అంటే..

ugadi 2026 panchangam parabhava nama samvatsara vidhyarthi rasi phalalu students horoscope

Education Horoscope 2026 : పరాభవ నామ సంవత్సర రాశి ఫలితాలను ఇప్పటికే వెల్లడించారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ ఏడాది పలు రంగాల వారికి ఎలా ఉండబోతుందో చెప్పుకొచ్చారు. అలానే ఈ సంవత్సరం 12 రాశుల విద్యార్థులకు ఎలా ఉండనుందో వివరించారు. ఆ వివరాలు..

  1. మేష రాశి విద్యార్థులకు కలిసి వచ్చే సమయం. కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది.
  2. వృషభ రాశి విద్యార్థులకు కలిసి వస్తుంది.. అనుకున్న ఫలితాలు సాధిస్తారు.
  3. మిధున రాశి విద్యార్థులకు శుభ ఫలితాలు, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి.
  4. కర్కాటక రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితం. కష్టేఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి. ఎంత కష్టపడి చదివితే అంత మంచి ఫలితం అంటున్నారు.
  5. సింహ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలున్నాయి. ఉన్నత చదువులు చదవాలన్న మీ ఆశ ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు.
  6. కన్యా రాశి విద్యార్థులకు అనుకూల సమయం.. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
  7. తులా రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు. విదేశీ ప్రయత్నాలు ఫలించును.
  8. వృశ్చిక రాశి విద్యార్థులకు సత్ఫలితాలు వస్తాయి. చదువు విషయంలో చేసే ప్రయత్నాలు, విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
  9. ధనుస్సు రాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు, కొంచెం కష్టపడి.. కొంచెం ఇష్టపడి చదవితే శుభ ఫలితాలు పొందుతారు.
  10. మకర రాశి విద్యార్థులకు పరాభవ నామ సంవత్సరం విద్యా పరంగా కలిసి వచ్చును.
  11. కుంభ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు అవకాశం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం పొందుతారు. కానీ సోమరితనం వదులుకుంటేనే ఇవన్నీ సాధ్యం.
  12. ఈ సంవత్సరం మీన రాశి విద్యార్థులకు ఏకాగ్రత తగ్గుతుందంటున్నారు. అందువల్ల వారు సరస్వతీ బీజాక్షరాన్ని జపిస్తే మంచిదంటున్నారు.