Lucky Zodiac Signs 2026 : ఉగాది నుంచి ఈ రాశుల వారి జాతకం మారబోతుంది… వారు చెప్పిందే వేదం.. పట్టిందల్లా బంగారం..!
Lucky Zodiac Signs 2026 : 2026 ఉగాది ప్రారంభం, ఆ తర్వాత ద్వితియార్ధం నుంచి పలు రాశుల వారికి అదృష్టం కలగబోతుందంటున్నారు పండితులు.
- Dharani Pilli
- Published On : March 17, 2026 / 08:27 PM IST
ugadi 2026 rasi phalalu lucky predictions for zodiac signs major auspicious changes coming this year
Lucky Zodiac Signs 2026 : ఉగాది పండుగ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి.. ఆ తర్వాత పంచాంగ శ్రవణం. ఇప్పటికే పలువురు జ్యోతిష్య నిపుణులు.. ఉగాది రాశి ఫలాలు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ ఉగాది నుంచి పలు రాశుల వారిని అదృష్టం వరించబోతుందని.. రాబోయే సంవత్సరం అంతా వారికి బ్రహ్మాండంగా ఉంటుందని తెలిపారు.
ఉగాది నుంచే అదృష్టం పొందే రాశులు: వృశ్చికం, మీనం, కర్కాటకం
మార్చి 19 నుంచే వీరికి మంచి కాలం మొదలవుతుంది. అడ్డంకులు తొలగిపోయి, అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయంటున్నారు.
ఏడాది ద్వితీయార్థం (అక్టోబర్ తర్వాత) అదృష్టం పొందే రాశులు: మేషం, సింహం, మకరం, ధనుస్సు:
అక్టోబర్ నెల దాటిన తర్వాత వీరికి ఆకస్మాత్తుగా ధనలాభం కలగడం.. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి కావడం జరుగుతుంది అంటున్నారు.
వివిధ రంగాల్లో ఫలితాలు:
- ఆర్థికం: వృషభం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, అప్పులు తీరిపోతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అత్యుత్తమమైన సమయం అంటున్నారు.
- ఉద్యోగం: పైన చెప్పిన రాశుల వారు ఆఫీసుల్లో గుర్తింపు, ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి ప్రయోజనాలు పొందే లభించే అవకాశం ఉంది.
- విద్యార్థులు: పైన పేర్కొన్న రాశుల విద్యార్థుల్లో.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసాలు సులభంగా వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
- ఆస్తులు: పైన చెప్పిన రాశులు వారు ఎదుర్కొంటున్న కేసులు పరిష్కారమై పాత ఆస్తులు చేతికి అందుతాయి. గతంలో చేసిన పెట్టుబడులకు భారీ లాభాలు వస్తాయి.
- ఆరోగ్యం: పాత అనారోగ్య సమస్యలు నయమై ఫిట్ గా ఉంటారు. యోగా, ధ్యానంపై శ్రద్ధ పెట్టడం మంచిది.
పరాభవ నామ సంవత్సరంలో పైన పేర్కొన్న రాశుల వారికి ఎంతో సంతోషాన్ని, అభివృద్ధిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
