Dhanasu Rasi Phalalu 2026 : ధనస్సు రాశి వారికి అలర్ట్.. అర్ధాష్టమ శని ప్రభావం.. ప్రతి పనిలో ఆటంకాలే.. ఈ పూజలు చేయించుకుంటే ఉపశమనం..!
Dhanasu Rasi Phalalu 2026 : ఈ ఉగాది నుంచి ధనస్సు రాశి వారికి ఏమాత్రం కలిసి రాదని.. నమ్మిన వాళ్లే మోసం చేస్తారని పండితులు హెచ్చరిస్తున్నారు.
- Dharani Pilli
- Published On : March 14, 2026 / 03:50 PM IST
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 dhanasu rasi phalalu Sagittarius horoscope
Dhanasu Rasi Phalalu 2026 : ఈ ఉగాది పండగ నుంచి ధనస్సు రాశి వారికి కష్ట కాలం ప్రారంభం అవ్వబోతుంది అంటున్నారు. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారిపై అర్థాష్టమ శని ప్రభావం ఉంటుందని.. కనుక ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయని.. బద్ధకం, చిరాకు పెరుగుతాయని అంటున్నారు. ఆదాయం బాగానే ఉన్నా అంతకు మించిన ఖర్చులు ఎదురవుతాయని తెలిపారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దానికన్నా తక్కువ లాభం వస్తుందని.. ఎంతో కష్టపడితేనే ఫలితం ఉంటుంది అన్నారు. నమ్మిన వారే మోసం చేస్తారని.. శుభకార్యాలు ప్రారంభించినా ఆటంకాలు ఎదురయ్యి అవి ఆలస్యం అవుతాయని తెలిపారు.
ఈ సంవత్సరం ధనస్సు రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలని.. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుందని.. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాల్లో మోసపోతారని.. రాజకీయ నాయకుల పలుకుబడి తగ్గుతుందని.. రైతులకు పంటలు సరిగా పండక అప్పుల పాలవుతారని, క్రీడాకారులు, కళాకారులకు సరైన అవకాశాలు లభించవని.. స్త్రీలకు బంధువుల వల్ల సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. కానీ దైవారాధన చేస్తే మనస్సుకు శాంతి లభిస్తుందని సూచిస్తున్నారు.
ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 5, అవమానం: 6
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
నక్షత్రం కలిసివచ్చే నెలలు అదృష్ట వారాలు సంఖ్యలు
- మూల (1-4 పాదాలు) మార్చి, జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి & మార్చి (2027) ఆది, గురు, శుక్ర 1, 4, 5, 9
- పూర్వాషాడ (1-4 పాదాలు) మార్చి, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి (2027) సోమ, బుధ, గురు 4, 6, 7, 9
- ఉత్తరాషాడ (1వ పాదం) మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి (2027) బుధ, గురు, శని 3, 4, 5, 9
పరిహారాలు-పూజలు:
- ఉగాది తర్వాత గురు, శని, కేతు గ్రహాలకు జపాలు చేయించుకుని శెనగలు, నల్ల నువ్వులు, ఉలవలు దానం ఇవ్వాలి.
- క్షేత్ర దర్శనం: శ్రీకాళహస్తి, అరుణాచలం, అయ్యప్ప స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకోవడం మంచిది.
- స్తోత్ర పఠనం: సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, బిల్వాష్టకం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం విశేష ఫలితాలనిస్తుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.
