Makara Rasi Phalalu 2026 : ఉగాది నుంచి మకర రాశి వారికి మహర్జాతకం.. మీరు చెప్పిందే వేదం.. ఈ అమ్మవారిని పూజిస్తే అన్ని పీడలు తొలగిపోతాయి..!

Makara Rasi Phalalu 2026 : ఉగాది పండగ నుంచి మకర రాశి వారికి మహర్జాతకం పట్టబోతుందని.. వారు చెప్పిందే వేదంగా నడుస్తుందంటున్నారు పండితులు.

ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 makara rasi phalalu Capricorn horoscope

Makara Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరం నుంచి మకర రాశి వారు మహర్జాతకులుగా మారబోతున్నారని.. అద్భుతమైన విజయాలు సాధిస్తారని పండితులు చెబుతున్నారు. వృత్తి, వ్యాపారాల్లో విపరీతమైన లాభాలుంటాయని.. చాలా కాలంగా సంబంధాలు చూస్తున్న వారికి పెళ్లి కుదురుతుందంటున్నారు. కోర్టు వ్యవహారాల్లో మకర రాశి వారికి అనుకూలంగా తీర్పు వస్తుందని.. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి అన్యోనత పెరుగుతుందంటున్నారు. ఈ సంవత్సరం మకర రాశి వారు చెప్పిందే వేదం అన్నట్లుగా కొనసాగుతుందని వెల్లడించారు.

మకర రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి విదేశాలకు వెళ్తారని, ఉద్యోగులకు మంచి ప్యాకేజీతో జాబ్ వస్తుందని.. వ్యవసాయదారులకు పంట దిగుబడి పెరిగి అప్పులు తీర్చుతారని, రాజకీయ నాయకులకు పదవులు దక్కుతాయని.. క్రీడాకారులు, కళాకారులు, స్త్రీలకు కూడా అన్ని విధాలా కలిసి వస్తుందని తెలిపారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారని వెల్లడించారు.

ఆదాయం: 2, వ్యయం: 8, రాజపూజ్యం: 1, అవమానం: 6

నక్షత్రాల వారీగా అదృష్ట సమయం

నక్షత్రం                                                        కలిసివచ్చే నెలలు                                                            అదృష్ట వారాలు                               సంఖ్యలు

  • ఉత్తరాషాడ (2,3,4 పాదాలు)     మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి (2027)     బుధ, గురు, శని                                   3, 4, 5, 9
  • శ్రవణం (1-4 పాదాలు)            మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్, జనవరి (2027)                          బుధ, గురు, శని                                   1, 2, 3, 4
  • ధనిష్ట (1,2 పాదాలు)               ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి (2027)                          సోమ, గురు, శని                                  2, 3, 4, 7

పరిహారాలు-పూజలు : 

  • ఉగాది తర్వాత రాహు, కేతువులకు జపం చేయించి మినుములు, ఉలవలు దానం ఇవ్వాలి.
  • క్షేత్ర దర్శనం: అష్టాదశ శక్తిపీఠాలను లేదా వారాహి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల దిష్టి దోషాలు, శత్రు బాధలు తొలగుతాయి.
  • స్తోత్ర పఠనం: దేవీ ఖడ్గమాల స్తోత్రం లేదా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.