Meena Rasi Phalalu 2026 : మీన రాశి వారికి ఈ ఏడాది డబ్బే డబ్బే.. ఆ పని చేస్తే మాత్రం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతారు జాగ్రత్త..!
Meena Rasi Phalalu 2026 : ఉగాది పండగ నుంచి మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది.. వారి జీవితంలో చోటు చేసుకునే మార్పులు ఏవంటే..
- Dharani Pilli
- Published On : March 14, 2026 / 05:44 PM IST
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 meena rasi phalalu Pisces horoscope
Meena Rasi Phalalu 2026 : పరాభవ సంవత్సరంలో మీన రాశి వారికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని.. సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో వస్తాయని.. కనుక డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలను విజయవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. అయితే మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం, మధ్యవర్తిత్వం వంటివి చేయడం వల్ల పోలీస్ స్టేషన్, పంచాయతీల వరకు వెళ్లే పరిస్థితి వస్తుందని.. కనుక ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు వద్దని.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరమని.. సమయానికి నిద్రపోవడం చాలా అవసరమని అంటున్నారు.
ఈ సంవత్సరం మీన రాశి విద్యార్థుల ఏకాగ్రత తగ్గుతుందని.. అందుకు వారు తులసి ఆకులు నమలడం, సరస్వతీ బీజాక్షరాన్ని జపిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. ఉద్యోగులు కెరీర్‌లో తాము అనుకున్న విజయాలు సాధిస్తారని.. రైతులకు పంటలు బాగా పండుతాయని తెలిపారు. వ్యాపారస్తులకు అనేక మార్గాల్లో ఆదాయం వస్తుందని.. క్రీడాకారులు, కళాకారులు కూడా శ్రమిస్తే మంచి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. రాజకీయ నాయకులు పదవిని కాపాడుకోవడానికి కష్టపడాలని.. స్త్రీలకు ఊహించని రీతిలో ఆదాయం వచ్చి.. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారని తెలిపారు.
ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 7, అవమానం: 2
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
నక్షత్రం కలిసివచ్చే నెలలు అదృష్ట వారాలు సంఖ్యలు
- పూర్వాభాద్ర (4వ పాదం) మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి & ఫిబ్రవరి (2027) సోమ, గురు, శని 2, 3, 7
- ఉత్తరాభాద్ర (1-4 పాదాలు) మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఫిబ్రవరి (2027) ఆది, బుధ, శని 1, 3, 4, 8
- రేవతి (1-4 పాదాలు) జూన్, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి & మార్చి (2027) ఆది, బుధ, శుక్ర 2, 3, 4, 5
పరిహారాలు-పూజలు:
- ఉగాది తర్వాత శని, రాహు గ్రహాలకు జపాలు చేయించి నల్ల నువ్వులు, మినుములు దానం ఇవ్వాలి.
- క్షేత్ర దర్శనం: మందపల్లి శనేశ్వర ఆలయం, వేంకటేశ్వర స్వామి, దుర్గాదేవి ఆలయాలను దర్శించుకోవడం మంచిది.
- విశేష పూజలు: గోపూజ చేయడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. మణిద్వీప వర్ణన లేదా సౌందర్య లహరి పారాయణం/శ్రవణం శ్రేయస్కరం.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.
