10Tv ACE Achievers Awards 2024 : ఎంట్రప్రెన్యూర్స్ స్ఫూర్తిదాయక జర్నీకి నిలువుటద్దం.. 10టీవీ Ace అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ ..

ఒక అద్భుతమైన ఆలోచన.. లక్షల మందికి దారి చూపే ఆశాకిరణమవుతుంది. ఒక వినూత్న ప్రయత్నం.. విజయవంతమై యావత్‌ సమాజానికి మార్గనిర్దేశనం చేస్తుంది. ఒక డిఫికల్ట్‌ చాలెంజ్‌..

10Tv ACE Achievers Awards 2024

10Tv ACE Achievers Awards 2024 : ఒక అద్భుతమైన ఆలోచన.. లక్షల మందికి దారి చూపే ఆశాకిరణమవుతుంది. ఒక వినూత్న ప్రయత్నం.. విజయవంతమై యావత్‌ సమాజానికి మార్గనిర్దేశనం చేస్తుంది. ఒక డిఫికల్ట్‌ చాలెంజ్‌.. ఎంతోమంది సమస్యల్ని పరిష్కరించే సమాధానమవుతుంది. కార్యదీక్ష, దృఢ సంకల్పమనే ఆయుధాలతో లక్ష్యం దిశగా ఒక్కో అడుగువేసి.. మైలురాళ్లను అధిగమించిన వాళ్లు మనచుట్టూ ఎంతోమంది.

రంగం ఏదైనా.. ఆటుపోట్లు ఎన్నున్నా.. పడిలేచిన కెరటంలా కష్టాలను ఎదురొడ్డి ఎదిగిన రియల్‌ హీరోలు వాళ్లు. సంస్థ, వ్యాపారం, పరిశ్రమ పేరేదైనా.. డ్రీమ్స్‌, ప్యాషన్‌ను ఫుల్‌ఫిల్‌ చేసుకుంటూ నిరంతరం సవాళ్లతో యుద్ధమే చేస్తారు. సమాజానికి సంపద సృష్టించే యంత్రాలవుతారు. మొక్కగా మొదలై పదిమందికీ నీడనిచ్చే మహావృక్షాలవుతారు. అలా శిఖరాలను అధిరోహించిన ఇన్నోవేటివ్‌ బిజినెస్‌ లీడర్స్‌ సక్సెస్‌.. ఒక ఫార్ములా. వారి అనుభవం నవతరానికి శక్తిమంతమైన టానిక్‌.

తెలుగు రాష్ట్రాల్లో అలాంటి విజేతల స్ఫూర్తిమంతమైన ప్రస్థానానికి అక్షర రూపమే.. 10TV ACE ACHIEVERS COFFEE TABLE BOOK. ఆ సక్సెస్‌ ఐకాన్స్‌కు సెల్యూట్‌ చేస్తూ మరింతమందిని ఎంకరేజ్‌ చేయడమే 10TV ACE ACHIEVERS COFFEE TABLE BOOK ప్రధానోద్దేశం. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 8వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6గంటలకు నుంచి ప్రారంభమవుతుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు