Royal Enfield Guerrilla 450
Royal Enfield Guerrilla 450 : రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు అద్భుతమైన న్యూస్.. ఈ మార్చిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైకులు రాబోతున్నాయి. రాబోయే 30 నుంచి 50 రోజుల్లో భారత మార్కెట్లో రెండు కొత్త బైకులు లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6, బ్రాండ్ ఫస్ట్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, 2026 గెరిల్లా 450 బైక్ వెర్షన్లు కీలక అప్‌డేట్స్‌తో రానున్నాయి. ఈ రెండు బైకులు చెన్నైలో స్థానికంగా అభివృద్ధి చెందుతున్నాయి.
భవిష్యత్తులో వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 450cc లైనప్‌లో హిమాలయన్ 450, గెరిల్లా 450 ఉన్నాయి. గెరిల్లా 450 మొదట 2024లో లాంచ్ అయింది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ మార్చి 2026 చివరి నాటికి లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ బుల్లెట్ బైక్ ఫస్ట్ అప్‌డేట్ కొన్ని ముఖ్యమైన మార్పులతో రానుందని భావిస్తున్నారు.
ఈ అప్‌డేట్‌పై కంపెనీ పెద్దగా వివరాలను షేర్ చేయలేదు. కొత్త మార్పులు రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా మారుస్తాయో క్లారిటీ లేదు. అయితే, కంపెనీ గత మోడల్స్ ఆధారంగా బైక్ కొన్ని మార్పులతో వచ్చే అవకాశం ఉంది. భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అప్‌డేట్ వెర్షన్‌లో కూడా ఇలాంటి మార్పులు కనిపించాయి. ఈ మార్పులు రైడర్ సౌకర్యం, మోటార్‌సైకిల్ కంట్రోలింగ్ మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
అదేవిధంగా, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు మోడల్ ఫీచర్లలో కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. ఇందులో కొత్త కలర్ ఆప్షన్లతో డిజైన్ కూడా మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బ్రావా బ్లూ, షాడో యాష్, పీక్స్ బ్రాంజ్, స్మోక్ సిల్వర్, ప్లేయా బ్లాక్, గోల్డ్ డిప్ వంటి కలర్ ఆప్షన్లలో వస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ధర ఎంతంటే? :
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ప్రారంభ ధర రూ. 2.56 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. షెర్పా ఇంజిన్‌తో రన్ అవుతుంది. హిమాలయన్ 450కి కూడా పవర్ అందిస్తుంది. ఈ 452CC, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ 40Hp, 40NM పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రైడ్-బై-వైర్ సిస్టమ్, రెండు రైడింగ్ మోడ్‌లతో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
ఈ బుల్లెట్ బైకులో 43 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు ఉన్నాయి. 140mm వీల్ ట్రావెల్ అందిస్తాయి. బ్యాక్ సైడ్ 150 mm మోనో-షాక్ సస్పెన్షన్ ఉంటుంది. బ్రేకింగ్ కోసం ఫ్రంట్ సైడ్ డ్యూయల్-పిస్టన్ కాలిపర్లతో 310mm వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 270mm సింగిల్-పిస్టన్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కూడా చేర్చింది. బైక్ 17-అంగుళాల వీల్స్‌పై రన్ అవుతుంది.