2023 Yamaha Bikes Launch : యువత కోసం భారత్‌కు యమహా స్పోర్ట్స్ బైకులు వచ్చేశాయి.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

2023 Yamaha Bikes Launch : భారత మార్కెట్లోకి యమహా నుంచి రెండు సరికొత్త సూపర్ స్పోర్ట్స్ బైకులు ఎంట్రీ ఇచ్చాయి. యమహా YZF R3, యమహా MT-03 రెండు మోడల్స్ కంపెనీ లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

2023 Yamaha Bikes Launch : యువత కోసం భారత్‌కు యమహా స్పోర్ట్స్ బైకులు వచ్చేశాయి.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

2023 Yamaha R3 and MT-03 New Two Bikes launched in India

2023 Yamaha Bikes Launch : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి రెండు కొత్త స్పోర్ట్స్ బైకులు వచ్చాయి. ప్రమఖ జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా Yamaha YZF-R3, Yamaha MT-03 అనే రెండు స్పోర్ట్స్ బైక్‌లను లాంచ్ చేసింది. ఈ మేరకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా అకౌంట్లలో ప్రకటించింది. 2023 యమహా ఆర్3 అండ్ ఎంటీ -03 మోడల్స్ ధరలు రూ. 4.6 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ఆర్3 మోడల్ కొంత విరామం తర్వాత భారత్‌కు తిరిగి వచ్చింది. అయితే, ఎంటీ-03 మోడల్ మాత్రం తొలిసారిగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

రెండు బైకుల ధర ఎంతంటే? :
ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఒకే ప్లాట్‌ఫారమ్, పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉన్నాయి. యమహా ఆర్3 ధర రూ. 4.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, యమహా ఎంటీ-03 ధర రూ. 4.65 లక్షల (ఎక్స్-షోరూమ్)తో వస్తుంది. 2023 యమహా ఆర్3, యమహా ఎంటీ-03కు పవర్ అందించే 321సీసీ లిక్విడ్-కూల్డ్ 4-స్ట్రోన్, ఇన్‌లైన్ టూ-సిలిండర్ మోటార్ కలిగి ఉన్నాయి. 42బీహెచ్‌పీ, 29.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు మోటార్‌సైకిళ్లు తేలికపాటి డైమండ్ ఫ్రేమ్‌తో వచ్చాయి. యూఎస్‌డీ, మోనోక్రాస్ వెనుక సస్పెన్షన్ మధ్య సస్పెండ్, ముందువైపు 130ఎమ్ఎమ్ ప్రయాణాన్ని, వెనుకవైపు 125ఎమ్ఎమ్ ప్రయాణాన్ని అందిస్తాయి.

Read Also : Car Mileage Tips : మీ కారు మైలేజీ పెరగాలన్నా.. ఇంధనాన్ని ఆదా చేయాలన్నా.. ఈ 10 టిప్స్ తప్పక తెలుసుకోండి..!

ఆర్3, ఎంటీ-3 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
2023 యమహా ఆర్3 పూర్తి ఫెయిరింగ్‌తో లీటర్-క్లాస్ వైజెడ్ఎఫ్-ఆర్1 నుంచి అనేక అంశాలను కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, టర్న్ సిగ్నల్స్ అన్నీ ఎల్ఈడీ లైటింగ్‌ను కలిగి ఉంటాయి. ఆర్3 మోడల్ భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఆర్15 ఫీచర్ల మాదిరిగా ఉంది. ఎంటీ-03 స్ట్రీట్‌ఫైటర్ స్టైల్‌తో మిగిలిన ఎంటీ ఫ్యామిలీ నుంచి అదే డిజైన్‌తో వచ్చింది. దీనికి ఎల్‌ఈడీ లైటింగ్ కూడా ఉంది. రెండు మోటార్‌సైకిళ్లకు బ్రేకింగ్ ముందువైపు 298ఎమ్ఎమ్ డిస్క్, వెనుకవైపు 220ఎమ్ఎమ్ డిస్క్ అమర్చారు.

2023 Yamaha R3 and MT-03 New Two Bikes launched in India

2023 Yamaha R3 and MT-03 New Two Bikes

భారతీయ యువ కస్టమర్ల కోసమే :
యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఈషిన్ చిహానా మాట్లాడుతూ.. ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ బ్రాండ్ క్యాంపెయిన్‌లో భాగంగా యమహా యువ భారతీయ వినియోగదారుల అవసరాన్ని ఆకర్షించేలా అద్భుతమైన ఫీచర్లతో రెండు స్పోర్ట్స్ మోడల్‌లను తీసుకొచ్చినట్టు తెలిపారు. ప్రీమియం సెగ్మెంట్ శ్రేణిలో ఆర్-సిరీస్, ఎంటీ-సిరీస్ మోడల్‌లు అత్యుత్తమ పనితీరు, ఐకానిక్ డిజైన్‌తో భారతీయ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ సిరీస్‌లోనే పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ మోడల్‌ కోసం యమహా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

భారత మార్కెట్లో సరికొత్త సూపర్‌స్పోర్ట్ బైక్, ఆర్3, హైపర్-నేకెడ్, ఎంటీ-03 లాంచ్‌ను ప్రకటించడానికి సంతోషిస్తున్నామని ఆయన చెప్పారు. యమహా అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలను ప్రదర్శించే ఈ రెండు మోడల్‌లు నిస్సందేహంగా దేశంలోని యువ కస్టమర్‌ల ఆసక్తిని ఆకర్షిస్తాయని చిహానా ఆశాభావం వ్యక్తం చేశారు. యువకులకు ఈ రెండు బైకులు థ్రిల్లింగ్ రైడ్ అనుభవాన్ని అందిస్తాయని విశ్వసిస్తున్నామని తెలిపారు.

2023 Yamaha R3 and MT-03 New Two Bikes launched in India

Yamaha R3 and MT-03  Launch

యమహా వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు :
2023 యమహా ఆర్3 ట్రాక్ ఓరియెంటెడ్, దాదాపు 50/50 ముందు, వెనుక బరువు కలిగి ఉంటుంది. హ్యాండిల్‌బార్ క్రౌన్ అల్యూమినియంతో తయారైంది. అయితే, ఏరోడైనమిక్స్ మోటార్‌సైకిల్ పర్పార్మెన్స్ మరింత మెరుగుపరుస్తుంది. యమహా ఆర్3 ఐకాన్ బ్లూ, యమహా బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. అలాగే, ఎంటీ-03 కూడా మిడ్‌నైట్ సియాన్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. రెండు కలర్ ఆప్షన్ల ధరలు ఒకే విధంగా ఉంటాయి. ఆసక్తి గల కస్టమర్‌లు తమ మోటార్‌సైకిళ్లను యమహా అధికారిక వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు.

Read Also : Car Insurance Claim : వరదల్లో దెబ్బతిన్న కార్లు, ద్విచక్ర వాహనాలకు బీమా క్లెయిమ్ ఎలా దాఖలు చేయాలో తెలుసా?