Toyota Innova Crysta : లగ్జరీ లుక్‌తో ఫ్యామిలీ కింగ్ రీ-ఎంట్రీ! టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రీమియం ఫీచర్లు కేక.. ధర ఎంతంటే?
Toyota Innova Crysta : టయోటా నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ వచ్చేసింది. ఈ కొత్త ఇన్నోవా క్రిస్టాలో ఎక్స్‌ట్రనల్ మార్పులు, సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- June 5, 2026 / 04:26 PM IST
Toyota Innova Crysta
Toyota Innova Crysta : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో ప్రముఖ ఎంపీవీ ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్‌ను లాంచ్ చేసింది. కొత్త ఇన్నోవా క్రిస్టాలో ఎక్స్ ట్రనల్ మార్పులతో సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. ఈ కొత్త కారుకు ప్రీమియం డిజైన్ అందించింది.
అంతేకాదు.. ఈ ఎంపీవీ గతంలో కన్నా మరింత ప్రీమియంగా మారింది. కొత్త ఇన్నోవా క్రిస్టా 2026 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.72 లక్షలు. 2027లో ఈ మోడల్ ప్రొడక్టును నిలిపివేసే ముందు ఇన్నోవా క్రిస్టాకు ఇదే చివరి కీలక అప్‌డేట్ కావచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా ధర, వేరియంట్లు :
టయోటా కొత్త ఇన్నోవా క్రిస్టాను అనేక సీటింగ్ కాన్ఫిగరేషన్‌లు వేరియంట్‌లలో అందిస్తోంది. ఆ వేరియంట్లు ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- జీఎక్స్ ఫ్లీట్ – 7 సీటర్ : రూ. 19.72 లక్షలు
- జీఎక్స్- 7 సీటర్ : రూ. 19.72 లక్షలు
- GX- 8 సీటర్ : రూ. 19.77 లక్షలు
- GX+ - 7 సీటర్ : రూ. 21.15 లక్షలు
- GX+ – 8 సీటర్ : రూ. 21.20 లక్షలు
- VX- 7 సీటర్ : రూ. 24.93 లక్షలు
- VX- 8 సీటర్ : రూ. 24.98 లక్షలు
- ZX- 7 సీటర్ : రూ. 26.63 లక్షలు
ఎక్స్‌ట్రనల్ డిజైన్ :
కొత్త ఇన్నోవా క్రిస్టా 2026 ఫ్రంట్ డిజైన్ గతంలో కన్నా మరింత ఆకర్షణీయంగా మారింది. ఇందులో క్రోమ్ ఫినిషింగ్‌తో కొత్త గ్రిల్ ఉంది. ఫ్రంట్, బ్యాక్ బంపర్ కూడా అప్‌డేట్ చేసింది. అలాగే అదనపు క్రోమ్ ఎలిమెంట్లను కూడా చేర్చింది. ఈ మార్పులు మినహా, కారు మొత్తం డిజైన్, బాడీ ప్రొఫైల్ మాత్రం అలాగే ఉంచింది.
Read Also : Realme P4 Power 5G : చార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 10,000mAh బ్యాటరీ రియల్‌మి 5G ఫోన్‌పై ఖతర్నాక్ ఆఫర్!
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
టయోటా ఇంటీరియర్‌ను మరింత ప్రీమియంగా మార్చేసింది. ఇందులో ఇప్పుడు డ్యూయల్-టోన్ లెదర్ అప్‌హోల్స్టరీ, కొత్త డాష్‌బోర్డ్ డోర్ ట్రిమ్, వుడ్-ప్యాటర్న్ ఇన్సర్ట్‌లు, గ్రేస్ కాపర్-ఫినిష్డ్ బెజెల్స్ ఉన్నాయి. ఏసీ కంట్రోల్ ప్యానెల్ స్విచ్‌గేర్‌ను కూడా అప్‌డేట్ చేసింది. కంఫర్ట్, సేఫ్టీ కోసం వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లను కంపెనీ ఫస్ట్ టైమ్ చేర్చింది.
ఇంజిన్ ఆప్షన్లు :
మెకానికల్‌గా పరిశీలిస్తే.. కొత్త ఇన్నోవా క్రిస్టాలో ఎలాంటి మార్పులు లేవు. 148 హార్స్‌పవర్, 360Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేసే అదే 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.
