Summer AC Sale Offers : తక్కువ పవర్ బిల్లు.. ఎక్కువ కూలింగ్.. మిడిల్ క్లాస్‌కు రూ. 30వేల లోపు టాప్ 5 బెస్ట్ ఏసీలు..
Summer AC Sale Offers : వేసవిలో కొత్త ఏసీ కొనాలని చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఆప్షన్లతో కొత్త ఏసీలు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ తక్కువ పవర్ బిల్లులు ఎక్కువ సమయం కూలింగ్ కోసం చూస్తుంటే మీకోసం రూ. 30వేల లోపు ధరలో 5 ఏసీలను ఓసారి లుక్కేయండి..
Summer AC Sale Offers
- ఈ సమ్మర్ సీజన్లో కొత్త ఏసీ కొనేవారికి గుడ్ న్యూస్
- రూ. 30వేల లోపు ధరలో 5 బెస్ట్ ఏసీలు అందుబాటులో
- పవర్ బిల్లు తక్కువ, ఫాస్ట్ కూలింగ్ ఆప్షన్లు ఎక్కువ
Summer AC Sale Offers : కొత్త ఏసీ కొంటున్నారా? వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిని తట్టుకునేందుకు ఇంట్లో ఏసీ లేదా కూలర్ ఏదో ఒకటి ఉండాల్సిందే. మీరు కూడా కొత్త ఏసీ కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో మీ బడ్జెట్ ధరలో అద్భుతమై కూలింగ్ అందించే ఏసీలు ఉన్నాయి. కానీ, చాలా మందికి విద్యుత్ బిల్లులు భారంగా మారుతుంటాయి.
పవర్ బిల్లులు తక్కువగా వచ్చి ఫాస్ట్ కూలింగ్ అందించే ఏసీల కోసం చూస్తుంటే ఈ డీల్స్ (Summer AC Sale Offers) అసలు మిస్ చేసుకోవద్దు. మీ బడ్జెట్ సుమారు రూ. 30వేల లోపు ఉంటే.. శాంసంగ్, ఎల్జీ, ఐఎఫ్బీ, బ్లూ స్టార్ గోద్రెజ్ వంటి బ్రాండ్ల నుంచి కొన్ని బెస్ట్ ఇన్వర్టర్ ఏసీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకోసం 5 బెస్ట్ ఏసీ మోడళ్లను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
శాంసంగ్ AR50F12DOLHNNA (ధర రూ. 25,990) :
శాంసంగ్ ఏఆర్50F12DOLHNNA స్ప్లిట్ ఏసీ మార్కెట్లో సరసమైన ధరకు లభిస్తోంది. ఈ ఏసీ యూనిట్లో వన్-టన్ ఇన్వర్టర్ కంప్రెసర్, కాపర్ కండెన్సర్ కాయిల్స్ బ్లూ ఫిన్ ప్రొటెక్షన్ అమర్చింది.
5 ఫేస్ కన్వర్టిబుల్ కూలింగ్, సెల్ఫ్-క్లీన్ సపోర్ట్, ఆటో రీస్టార్ట్ వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లు లేవు. కానీ, మీ బడ్జెట్ ధరలో లభిస్తుంది. తక్కువ ధరలో కూలింగ్ ఏసీ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
ఐఎఫ్బీ CI133SL11RGM3 (ధర రూ. 28,490):
ఐఎఫ్బీ వన్ టన్ ఇన్వర్టర్ ఏసీ, సుమారు 110 చదరపు అడుగుల చిన్న గదుల కోసం అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ యూనిట్ 8-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్‌తో పాటు హైబ్రిడ్ ఫాస్ట్-కూలింగ్ సపోర్ట్ కూడా అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
మీకు పీఎమ్ 0.3 ఎయిర్ ఫిల్ట్రేషన్, డ్యూయల్ గోల్డ్ ఫిన్ కోటింగ్, బీఎల్డీసీ ఫ్యాన్ మోటార్లు, కాపర్ పైపింగ్ కూడా లభిస్తాయి. వారంటీ ప్యాకేజీ కంప్రెసర్‌పై 10 ఏళ్లు, PCBపై 5 ఏళ్ల వారంటీని అందిస్తుంది.
ఎల్జీ ఏఎస్-Q11KNVE (ధర రూ. 29,199) :
ఈ ఎల్జీ మోడల్ మిగతా ఏసీల కన్నా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. 0.8-టన్నులు అనేది చాలా చిన్న యూనిట్. ఈ సౌత్ కొరియా టెక్ దిగ్గజం కాంపాక్ట్ రూమ్స్, స్టడీ ఏరియాలు లేదా చిన్న ఆఫీస్ స్పేస్‌లను సరిగ్గా సరిపోతుంది. 2-స్టార్ లేబుల్ ఉన్నా తక్కువ మొత్తం పవర్ వినియోగం కారణంగా ఈ ఏసీ చాలా వరకు పవర్ ఎక్కువగా సేవ్ చేస్తుంది.
ఎల్జీలో ఫ్రాస్ట్ వాష్ క్లీనింగ్, యాంటీ-వైరస్ హెచ్డీ ఫిల్టర్లు, ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ కోటింగ్ 6-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వైడ్ ఆపరేటింగ్ వోల్టేజ్ రేంజ్ 55°C వరకు టెంపరేచర్లకు సపోర్టు ఇస్తుంది.
బ్లూ స్టార్ IE312PNU ధర రూ. 30వేలు :
ఈ బ్లూ స్టార్ వన్-టన్ స్ప్లిట్ ఏసీ టర్బో కూల్ మోడ్, 4-వే స్వింగ్, కాపర్ కాయిల్స్, స్మార్ట్ సెన్సార్లు స్టెబిలైజర్ లెస్ ఆపరేషన్‌ను అందిస్తుంది. సెల్ఫ్-క్లీన్ ఫంక్షన్ స్మార్ట్ డయాగ్నోసిస్ సపోర్ట్ కూడా మేనేజ్మెంట్ సమస్యలను తగ్గిస్తుంది. కంప్రెసర్ పీసీబీ రెండింటికీ చాలా ఏళ్ల వారంటీ కవరేజ్ ఉంది. సాధారణ గృహ వినియోగానికి లాంగ్ టైమ్ సేఫ్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
గోద్రెజ్ ఈసీ హెచ్ఐసీ 12Y3TH సీఏ (ధర రూ. 29,490) :
కన్వర్టిబుల్ కూలింగ్ ఇంటెలిజెంట్ టెంపరేచర్ మేనేజ్మెంట్కు సపోర్టు ఇస్తుంది. గోద్రెజ్ ఇన్వర్టర్ ఏసీ 52°C వరకు ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ఈ యూనిట్ ఫాస్ట్ కూలింగ్ అందించగలదని కంపెనీ చెబుతోంది. సెల్ఫ్-క్లీన్ సపోర్ట్, బ్లూ ఫిన్ కోటింగ్, ఐ-సెన్స్ రిమోట్ ఆధారిత కూలింగ్, కాపర్ కాంపోనెంట్స్ వంటి ఫీచర్లు రోజువారీ వినియోగానికి అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
