Affordable Smartwatches : ఫిట్‌నెస్ కోసం 5 బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు.. మీకు నచ్చిన వాచ్ ట్రై చేయండి.. మీ బడ్జెట్ ధరలోనే!
Affordable Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఫిట్‌నెస్ కోసం ప్లాన్ చేస్తుంటే మీకోసం 5 అత్యంత సరసమైన ధరలో స్మార్ట్‌వాచ్‌లు లభిస్తున్నాయి. ఇందులో ఏది కొంటారో కొనేసుకోండి.
- Sreehari A
- Published On : April 5, 2026 / 06:28 PM IST
Affordable Smartwatches
- మీ ఫిట్‌నెస్ జర్నీ కోసం మార్కెట్లో 5 సరసమైన స్మార్ట్‌వాచ్‌లు
- 100కు పైగా గేమింగ్ మోడ్, ఏఐ అసిస్టెంట్, SpO₂, హార్ట్ రేట్ మానిటర్లు
- ఏఐ క్రియేట్, ఏఐ సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లు, వాచ్ ఫేస్ డిజైన్
Affordable Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? మంచి ఫిట్‌నెస్ కోసం మార్కెట్లో అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌లు ఉన్నాయి. మీ ఫిట్‌నెస్ కోసం మంచి డివైజ్ దొరకడం లేదా? మీకోసం మార్కెట్లో కొన్ని స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్‌వాచ్‌లు 100కు పైగా గేమింగ్ మోడ్‌లతో పాటు, ఏఐ అసిస్టెంట్, SpO₂, హార్ట్ రేట్ మానిటర్ల వంటి ఫీచర్లతో లభ్యమవుతున్నాయి. ఫిట్ నెస్ ఫీచర్లు కావాలంటే ఈ స్మార్ట్ వాచ్ లలో మీకు నచ్చిన ఏదైనా ఒకటి కొనేసుకోవచ్చు..
ఫాస్ట్‌ట్రాక్ లిమిట్‌లెస్ గ్లైడ్ (రూ. 1,299) :
ఫాస్ట్‌ట్రాక్ లిమిట్‌లెస్ గ్లైడ్ అడ్వాన్స్ అల్ట్రా వ్యూ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ వాచ్ ఏటీఎస్ చిప్‌సెట్‌తో వస్తుంది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. ఇందులో ఇంటర్నల్ గేమ్‌లు, వాయిస్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి.
నాయిస్ పల్స్ 4 మాక్స్ (రూ. 2,499) :
నాయిస్ పల్స్ 4 మ్యాక్స్ అనేది స్మార్ట్‌వాచ్. ఏఐ క్రియేట్, ఏఐ సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. వాచ్ ఫేస్ డిజైన్ అందిస్తుంది. 32GB మెమరీ స్టోరేజ్‌తో పాటు 1.96-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ బ్లూటూత్ డివైజ్ యాక్టివిటీ ట్రాకర్, అలారం క్లాక్, జెస్చర్ కంట్రోల్, లైట్ వెయిట్, నోటిఫికేషన్‌ల వంటి కొన్ని స్పెషల్ ఫీచర్లతో వస్తుంది.
ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ (రూ. 1,199) :
ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో 1.83 HD డిస్‌ప్లేతో వస్తుంది. 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. IP67 రేటింగ్‌తో వస్తుంది. వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో SpO₂, హార్ట్ రేట్, మానిటర్ కూడా ఉన్నాయి.
బోట్ అల్టిమా ఎంబర్ (రూ. 1,899) :
బోట్‌లో అల్టిమా ఎంబర్, కస్టమైజడ్ ఫిట్‌నెస్ ఇండికేషన్స్, 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో 1.96-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ యూనిట్ తనకు తాను వాచ్ ఫేస్‌ను కూడా క్రియేట్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్ ఉంది. ఈ బ్లూటూత్ డివైజ్ 300 మిల్లీఆంపియర్-గంటల బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.
నాయిస్ పల్స్ 2 మాక్స్ (రూ. 980) :
నాయిస్ పల్స్ 2 మ్యాక్స్ 550 నిట్స్ బ్రైట్‌నెస్ 1.85-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, 10 రోజుల బ్యాటరీ లైఫ్, 100 స్పోర్ట్స్ మోడ్‌లు, స్మార్ట్ DND (డు నాట్ డిస్టర్బ్) ఫీచర్ ఉన్నాయి.
ఈ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్, iOS రెండింటినీ ఆపరేటింగ్ సిస్టమ్ అందిస్తుంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్లీప్ ట్రాకింగ్, యాక్టివిటీ ట్రాకింగ్, బ్రీతింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
