8th Pay Commission : 8వ వేతన సంఘంపై గేమ్ చేంజర్ అప్‌డేట్.. ఈసారి డబుల్ కాదు ట్రిపుల్ కాదు.. 400 శాతం జీతాల పెంపు!
8th Pay Commission: అందరికీ ఒకే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ బదులుగా, 8వ వేతన సంఘం వివిధ వేతన స్థాయిల కోసం 5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను ప్రతిపాదించింది. ఇదే అమలైతే కొంతమంది అధికారులకే 400 శాతం జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
- Sreehari A
- Published on- May 27, 2026 / 07:09 PM IST
8th Pay Commission ( Image Credit : AI )
- 5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కొత్త ఫార్మూల లెక్కిలివే
- ఉద్యోగ స్థాయిని బట్టి వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లకు డిమాండ్
- సీనియర్ అధికారుల కనీస జీతాలే 400 శాతం పెరిగే అవకాశం
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారుల్లో బిగ్ టెన్షన్.. ఈసారి 8వ వేతన సంఘంపై ప్రభుత్వ ఉద్యోగుల అంచనాలు భారీగా పెరిగాయి. ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) ఇచ్చిన కొత్త ఫార్ములా ప్రకారం.. ఉద్యోగ స్థాయిని బట్టి వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లు పెట్టాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఇదిగానీ అమలైతే కొంతమంది సీనియర్ అధికారుల కనీస జీతాలే 400 శాతం వరకు (8th Pay Commission) పెరిగే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వంపై అధిక భారం పడొచ్చనే ఆందోళన కేంద్రంలో పెరుగుతోంది.
సాధారణ వేతన సవరణ బదులుగా వివిధ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనేక భారీ ప్రతిపాదనలను సమర్పించాయి. ప్రభుత్వ వర్గాలకు, ఉద్యోగ సంఘాలకు మధ్య జరిగిన చర్చలు, గత వేతన సంఘాలతో పోలిస్తే ఈసారి ఉద్యోగుల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఇంత భారీ జీతాలు, పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే ప్రత్యక్ష ప్రభావమే ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారనుంది. అందుకే, కమిషన్‌లో దీనిపై పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి.
వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు డిమాండ్ :
ఇకపై ఉద్యోగులందరికీ ఒకే విధమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వర్తింపజేసే పరిస్థితి ఉండకపోవచ్చు. వివిధ వేతన స్థాయిల ఆధారంగా వేర్వేరు గుణకాలను వర్తింపజేయాలని ఐఆర్‌టీసీఏ ప్రతిపాదించింది. ఒకటి నుంచి 5 లెవల్‌కు 2.92, 6 నుంచి 8 లెవల్‌కు 3.50, 9 నుంచి 12 లెవల్‌కు 3.80, 13 నుంచి 16 లెవల్‌కు 4.09, అత్యంత సీనియర్ లెవల్‌కు 17, 18 లకు 4.38 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సంస్థ డిమాండ్ చేసింది.
ఈ ఫార్ములా ప్రభావం భారీగా ఉండవచ్చు. ఉదాహరణకు.. 17, 18 లెవల్ అధికారుల ప్రస్తుత మూల వేతనం సుమారు రూ. 2.5 లక్షల నుంచి దాదాపు రూ. 10.95 లక్షలకు పెరగవచ్చు. అలాగే, మిడిల్ లెవల్ ఉద్యోగుల కనీస వేతనం రూ. 45వేల నుంచి దాదాపు రూ. 1.57 లక్షలకు పెరగవచ్చు.
ప్రస్తుత వేతన విధానం జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాన్ని భారీగా తగ్గించిందని, సాంకేతిక, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారికి తగిన ప్రయోజనాలు అందడం లేదని ఐఆర్‌టీఎస్‌ఏ (IRTSA) పేర్కొంది.
Read Also : Hyundai Car Prices : హ్యుందాయ్ కార్ల రేట్లు పెరగబోతున్నాయ్.. ఈ నెలాఖరు లోపు బుక్ చేసుకుంటే..!
రైల్వేలోని సాంకేతిక, భద్రతా విభాగాలకు ప్రత్యేక వేతన విధానాలను ఏర్పాటు చేయాలని కూడా ఆ సంస్థ డిమాండ్ చేసింది. అంతేకాదు.. 50 శాతం కరువు భత్యాన్ని (DA) కనీస వేతనంలో విలీనం చేయాలని, వార్షిక ఇంక్రిమెంట్లను 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని పింఛను విధానంలో మార్పులు చేయాలని కూడా యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
OPS తరహా భద్రతకు డిమాండ్ :
పాత పింఛను పథకం (OPS)పై చర్చ తీవ్రమైంది. అయితే, OPSను పూర్తిగా అమలు ప్రభుత్వానికి కష్టమే అంటున్నారు. ఎందుకంటే.. దీర్ఘకాలంలో ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారాన్ని మోపుతుంది.
ఉద్యోగ సంఘాలు పదవీ విరమణ తర్వాత కనీస హామీతో కూడిన పింఛను ఇవ్వాలని, పింఛన్లను కరువు భత్యంతో లింక్ చేయాలని కోరుతున్నాయి. ప్రస్తుత ద్రవ్యోల్బణం, కుటుంబ ఖర్చుల దృష్ట్యా, పాత ముగ్గురు సభ్యుల కుటుంబ యూనిట్ సూత్రం ఇకపై ఆచరణ సాధ్యం కాదని కూడా కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
జీతాల పెంపు ప్రభావం ఉద్యోగుల జీతాలకే కాదు.. పెన్షన్లు, అలవెన్సులు, బకాయిలు, భవిష్యత్ రిటైర్మెంట్ బాధ్యతలను కూడా అనేక రెట్లు పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీతాల పెంపు విషయంలో ఇదే పద్ధతులనే అనుసరిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మితిమీరిన పెంపుతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
విశ్రాంత న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 8వ వేతన సంఘం ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లోని ఉద్యోగ సంఘాలు, యూనియన్లతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ తర్వాత ఈ కమిషన్ లక్నో, భువనేశ్వర్, హైదరాబాద్, శ్రీనగర్, లడఖ్ వంటి నగరాల్లో కూడా సంప్రదింపుల సమావేశాలు నిర్వహించనుంది. ఈ కమిషన్ సిఫార్సులతో సుమారు 1.1 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలపై ప్రభావం చూపుతాయి.
