8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. 3శాతం కాదు.. 6శాతం ఇంక్రిమెంట్? కేంద్ర ఉద్యోగుల జీతాల్లో భారీ మార్పు!
8th Pay Commission : 8వ వేతన సంఘం అమలుపై ఉత్కంఠ నెలకొంది. లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతాల సవరణలపై త్వరలోనే స్పష్టత రానుంది. ప్రభుత్వం వార్షిక ఇంక్రిమెంట్ రేటును సవరిస్తుందా? లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకనుంది.
- Sreehari A
- Updated on- August 2, 2026 / 05:41 PM IST
8th Pay Commission
- కేంద్ర ఉద్యోగులకు బంపర్ న్యూస్..
- 6శాతం వార్షిక పెంపు వస్తే జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?
- అదే జరిగితే 10 ఏళ్లలో రూ.20 లక్షల అదనపు ఆదాయం
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. 8వ వేతన సంఘం అమలుపై లక్షలాది మంది ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో పాటు ఇప్పుడు వార్షిక ఇంక్రిమెంట్ రేటు కూడా పెరుగుతుందా? అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం భాగస్వాముల అభిప్రాయాలను 8వ కేంద్ర వేతన సంఘం సేకరిస్తూ సమావేశాలు నిర్వహిస్తోంది. సుమారు 2027 నాటికి రిపోర్టును సమర్పించనుంది. ఉదాహరణకు.. వార్షిక ఇంక్రిమెంట్‌ను ప్రస్తుత 3 శాతం నుంచి 6 శాతానికి పెంచితే.. ఒక ఉద్యోగి పదేళ్లలో కనీస వేతనం భారీగా పెరుగుతుంది.
ఈ లెక్క కేవలం ఉదాహరణ మాత్రమే. ప్రస్తుత 7వ కేంద్ర వేతన సంఘం పే మ్యాట్రిక్స్ ఆధారంగా లెక్కించారు. అయితే, అధిక వార్షిక ఇంక్రిమెంట్ (8th Pay Commission) కాలక్రమేణా ఎంతవరకు పెరగనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వార్షిక పెంపుపై భారీ డిమాండ్ :
7వ వేతన సంఘం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్ అందుకుంటున్నారు. 8వ వేతన సంఘానికి సమర్పించిన తమ సిఫార్సులలో ఉద్యోగ సంఘాలు ప్రస్తుత 3 శాతం నుంచి కనీసం ఏడాదికి 6 శాతానికి పెంపును కోరాయి. ఏడాదికి 6 శాతం పెంపుతో కాలక్రమేణా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో భారీగా పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు.
వేతనాల పెంపుపై ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇదే :
సంయుక్త సంప్రదింపుల యంత్రాంగం జాతీయ మండలి, అఖిల భారత రక్షణ ఉద్యోగుల సమాఖ్య జాతీయ తపాలా సంస్థల సమాఖ్య అన్నీ వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచాలని సూచించాయి. భారతీయ రైల్వే పర్యవేక్షకుల సంఘం వార్షిక ఇంక్రిమెంట్‌ను 5 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తోంది. అఖిల భారత నూతన పింఛను పథకం ఉద్యోగుల సమాఖ్య వార్షిక ఇంక్రిమెంట్‌ను 7 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది.
అధిక వార్షిక వేతనం :
ఆన్‌లైన్ రిపోర్టుల ప్రకారం.. 8వ వేతన సంఘం 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఖరారు చేసి వార్షిక ఇంక్రిమెంట్ రేటును 3 శాతం నుంచి 6 శాతానికి పెంచితే రాబోయే 10 ఏళ్లలో ఉద్యోగుల వేతనాలు ఎలా పెరుగుతాయో ఇప్పుడు లెక్కల వారీగా పరిశీలిద్దాం..
ప్రాథమిక వేతనం : లెవల్ 1 : రూ. 18,000
ప్రాథమిక జీతం : రూ. 37,800 (2.1 రెట్లు పెరిగితే)
10 ఏళ్లలో మొత్తం చెల్లింపు : 3 శాతం వార్షిక జీతానికి రూ. 52,00,016
6 శాతం వార్షిక జీతానికి రూ. 59,78,809
10 ఏళ్లలో అదనపు వేతనం : 6 శాతం వార్షిక జీతానికి రూ. 7,78,793 లక్షలు
ప్రాథమిక వేతనం : లెవల్ 4 : రూ. 25,500
ప్రాథమిక జీతం : రూ. 53,550 (2.1 రెట్లు పెంపు)
10 ఏళ్లలో మొత్తం వేతనం : 3 శాతం వార్షిక వేతనంతో రూ. 73,66,689
6 శాతం వార్షిక వేతనంతో రూ. 84,69,979
10 ఏళ్లలో అదనపు వేతనం : 6 శాతం వార్షిక వేతనంతో రూ. 11,03,290 లక్షలు
బేసిక్ పే లెవల్ 6 : రూ. 35,400
ప్రాథమిక జీతం : రూ. 74,340 (2.1 రెట్లు పెరిగితే)
10 ఏళ్లలో మొత్తం వేతనం :
3 శాతం వార్షిక వేతనంతో రూ. 1,02,26,697
6 శాతం వార్షిక వేతనంతో రూ. 1,17,58,324
10 ఏళ్లలో అదనపు వేతనం : 6 శాతం వార్షిక వేతనంతో రూ. 15,31,626 లక్షలు
బేసిక్ పే : లెవల్ 8 : రూ. 47,600
ప్రాథమిక జీతం : రూ. 99,960.00 (2.1 రెట్లు పెరిగితే)
10 ఏళ్లలో మొత్తం వేతనం : 3 శాతం వార్షిక వేతనానికి రూ. 1,37,51,153
6 శాతం వార్షిక వేతనానికి రూ. 1,58,10,627
10 ఏళ్లలో అదనపు వేతనం : 6 శాతం వార్షిక వేతనానికి రూ. 20,59,475 లక్షలు
ఈ వార్షిక పెంపు రేట్ల ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమే. వాస్తవంగా జీతాల పెంపు అనేది మరోలా ఉండవచ్చు.
వార్షిక ఇంక్రిమెంట్ రేటు పెరుగుతుందా? :
8వ వేతన సంఘం సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. వార్షిక ఇంక్రిమెంట్ రేటును పెంచాలని సిఫార్సు చేస్తుందో లేదో ఇంకా వెల్లడించలేదు. 8వ వేతన సంఘం అధిక వార్షిక ఇంక్రిమెంట్‌ను సిఫార్సు చేస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఆ సంఘం రిపోర్టును పూర్తి చేసి ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాకే అసలు క్లారిటీ వస్తుంది.
