8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. అదే జరిగితే ఆ ఉద్యోగుల జీతాలు డబుల్? పూర్తి లెక్కలివే..!
8th Pay Commission : 8వ వేతన సంఘంలో డీఏను బేసిక్ పేలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల సంఘాలు డిమాండ్ డిస్తున్నాయి. లెవెల్-6 ఉద్యోగుల బేసిక్ పే 7 ఏళ్లలో ఎలా రూ.1.52 లక్షలకు చేరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- September 11, 2026 / 04:56 PM IST
8th Pay Commission
- డీఏ విలీనంతో 7 ఏళ్లలో లెవెల్-6 ఉద్యోగుల బేసిక్ పే డబుల్
- డీఏ కలిపితే రూ.74,340 నుంచి రూ.1.52 లక్షలకు బేసిక్ పే?
- కేంద్ర ఉద్యోగులకు భారీ జీతాల పెంపు? డీఏ విలీనం సాధ్యమేనా?
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు సూపర్ గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అదేగానీ జరిగితే ఉద్యోగుల జీతాలు డబుల్ కానున్నాయి. ఇంతకీ ఏయే ఉద్యోగుల జీతాలు రెట్టింపు కానున్నాయి? ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షన్ దారుల్లో 8వ వేతన సంఘం (8th Pay Commission)పై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది.
ముఖ్యంగా డీఏను బేసిక్ పేలో విలీనం చేయాలన్న డిమాండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ సంఘాల ప్రతిపాదన ప్రకారం.. డీఏ నిర్దిష్ట స్థాయికి చేరితే దాన్ని బేసిక్ పేలో కలిపితే భవిష్యత్తులో జీతాల పెంపు భారీగా ఉండే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. అయితే, డీఏ పెరిగినప్పటికీ అది ఆటోమేటిక్‌గా బేసిక్ పేలో కలవదు. అందుకే NC-JCM, NFPE, AINPSEF, IRTSA, PSNM, AIDEF వంటి ఉద్యోగ సంఘాలు డీఏ విలీనాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
కొన్ని సంఘాలు డీఏ 25 శాతానికి పెంచితే మరికొన్ని 50 శాతానికి పెంచేతి దాన్ని బేసిక్ పేలో విలీనం చేయాలని కోరుతున్నారయి. వార్షిక ఇంక్రిమెంట్‌ను 5 శాతం నుంచి 7 శాతం వరకు పెంచాలని కూడా కొన్ని సంఘాలు ప్రతిపాదించాయి.
లెవెల్-6 ఉద్యోగికి ఎంత పెరగొచ్చు? :
ఉదాహరణకు.. 7వ వేతన సంఘంలో రూ.35,400 బేసిక్ పే ఉన్న లెవెల్-6 ఉద్యోగిని తీసుకుంటే.. 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే.. అప్పుడు 8వ వేతన సంఘం తర్వాత బేసిక్ పే రూ.74,340 కావచ్చు. ఆ తర్వాత ఏడాదికి సగటున 7శాతం ఇంక్రిమెంట్, డీఏలో సగటున 4శాతం వార్షిక పెంపు ఉంటుందని కేవలం అంచనా వేస్తే.. 2033 నాటికి డీఏ విలీనం సమయంలో బేసిక్ పే సుమారు రూ.1.52 లక్షలకు చేరే అవకాశం ఉన్నట్లు ఈ లెక్క చూపిస్తోంది.
అంటే.. ప్రారంభ సవరించిన బేసిక్‌తో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ. అయితే, ఇది ప్రభుత్వం ఆమోదించిన తుది లెక్క కాదు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఇంక్రిమెంట్, డీఏ విలీనం వంటి అంశాలపై 8వ వేతన సంఘం సిఫార్సులు, వాటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే అసలు జీతాలను నిర్ణయిస్తుంది.
సింపుల్‌గా చెప్పాలంటే.. డీఏను బేసిక్‌లో విలీనం చేస్తే ఒకసారి బేసిక్ పెరగడమే కాదు.. ఆ తర్వాతి ఇంక్రిమెంట్లు, డీఏ లెక్కింపులు కూడా పెరుగుతాయి. అందుకే ఉద్యోగ, పింఛనుదారుల సంఘాలు ఈ డిమాండ్‌ను కీలకంగా ముందుకు తెస్తున్నాయి.
