Aadhaar Cash Withdrawal : మీ ఆధార్ కార్డుతో ఈజీగా డబ్బులు తీయొచ్చు తెలుసా? నో పిన్.. నో కార్డు.. క్యాష్ విత్‌డ్రా ప్రాసెస్ ఇదిగో..
Aadhaar Cash Withdrawal: ఆధార్ ఉంటే చాలు.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులను ఈజీగా తెలుసుకోవచ్చు. డెబిట్ కార్డు, పిన్ నెంబర్ అవసరమే లేదు.. ఎలా డబ్బులు తీయొచ్చంటే?
Aadhaar Cash
- మీ ఆధార్ కార్డుతో డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చు?
- మీ ఆధార్ నంబర్, బయోమెట్రిక్ డేటా అవసరం
- బ్యాంకింగ్ ఏజెంట్ లేదా మైక్రో ఏటీఎం ద్వారా డబ్బులు తీయొచ్చు
Aadhaar Cash Withdrawal : ఆధార్ కార్డుతో కూడా డబ్బులు తీసుకోవచ్చు తెలుసా? ఏటీఎంల నుంచి మీ ఆధార్ కార్డు సాయంతో డబ్బులు తీసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇది కేవలం ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసమే కాదు.. మీ బ్యాంకు ఖాతా నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. వాస్తవానికి ఆధార్ కార్డుతో అవసరమైన డబ్బులను నేరుగా పొందవచ్చు. పూర్తి ప్రాసెస్ వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధార్ కార్డుతో డబ్బు ఎలా విత్‌డ్రా చేయొచ్చు? :
మీ ఆధార్‌ను మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయండి. ఆధార్ ద్వారా మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే.. ఆధార్ కార్డు, మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాంకు బ్రాంచ్ వద్దకు వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. మీ ఆధార్ లింక్ అయ్యాక మీ డబ్బును తీసుకోవచ్చు. ఏటీఎం కార్డు లేదా పిన్ అవసరం ఉండదు. మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఆధార్ నంబర్, బయోమెట్రిక్ డేటా అవసరం :
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా మీ సమీపంలోని AePS టచ్ పాయింట్ ఆపరేటర్ల (AOTs) వద్ద మీ బ్యాంక్ ఖాతా నుంచి ఈజీగా క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. AePS ఫీచర్ పేమెంట్ల కోసం మీ ఆధార్ నంబర్, ఫింగర్ ఫ్రింట్ ఇస్తే సరిపోతుంది.
బ్యాంకింగ్ ఏజెంట్ హెల్ప్ తీసుకోండి :
క్యాష్ విత్‌డ్రా కోసం మీ సమీపంలోని బ్యాంకింగ్ ఏజెంట్ లేదా మైక్రో ఏటీఎం వద్దకు వెళ్లండి. లోకల్ మార్కెట్లు, కిరాణా షాపుల వద్ద కనిపిస్తాయి. వీటిపై ‘బ్యాంకింగ్ సేవలు’ లేదా ‘ఆధార్-ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్’ అని సూచించే గుర్తులు ఉంటాయి. మీ ఆధార్ కార్డుతో డబ్బు విత్‌డ్రా చేయాలని అనుకుంటున్నట్టు ఏజెంట్‌కు చెప్పండి. స్పెషల్ డివైజ్ ద్వారా మీకు అందుబాటులో ఉన్న బ్యాంకుల లిస్టును చూపిస్తారు.
ఈ లిస్టు నుంచి మీ బ్యాంకును ఎంచుకుని 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత ప్రాసెసింగ్ కోసం మీ స్కానర్‌పై బొటనవేలు ఉంచాలి. ఒకవేళ ఐ స్కానర్‌ను వాడితే మీరు దానివైపు చూడాల్సి ఉంటుంది. ఈ బయోమెట్రిక్ స్కాన్ మీ ఐడెంటిటీని వెరిఫై చేస్తుంది.
ఐడెంటిటీ సక్సెస్ తర్వాత మీ ఫండ్స్ రిలీజ్ అవుతాయి. చివరగా, మీరు విత్‌డ్రా చేసిన మొత్తాన్ని కనిపించేలా ఫ్రింటెడ్ కన్ఫర్మేషన్ స్లిప్‌ను అందుకుంటారు. మీరు ఈ రసీదును మీ రికార్డుల కోసం ఉంచుకోవచ్చు.
సేఫ్టీ పరంగా కూడా AePS చాటా స్ట్రాంగ్. బయోమెట్రిక్ అథెంటికేషన్ మోసాలు జరగవు. కార్డ్, పిన్ లేదా డాక్యుమెంట్ల అవసరం ఉండదు. ఈ కొత్త సిస్టమ్ ముఖ్యంగా వృద్ధులకు, టెక్ అవగాహన తక్కువ ఉన్నవారికి చాలా ప్రయోజనరంగా ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి ఫారమ్‌లను నింపాల్సిన అవసరం లేదు. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన పనిలేదు. కేవలం ఫింగర్ ఫ్రింట్ ఉంటే సరిపోతుంది.
