Affordable Housing : రూ.50 లక్షల్లో మంచి ఇల్లు కావాలా? ఈ 3 నగరాల్లో కొనేసుకోండి.. 5 ఏళ్లలో 2రెట్లు రాబడి పక్కా..!
Affordable Housing : రూ.50 లక్షల బడ్జెట్‌తో ఇల్లు లేదా ప్లాట్ కొనాలనుకుంటున్నారా? పుణె, ధోలేరా, గ్రేటర్ నోయిడా-ఘజియాబాద్-ఫరీదాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ధరలు, మౌలిక సదుపాయాలు, అవకాశాలు, రిస్క్‌లపై పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- September 22, 2026 / 03:35 PM IST
Affordable Housing
- రూ.50 లక్షల్లో ఇల్లు కొనేందుకు ఈ ప్రాంతాలే బెటర్
- ఇల్లు కొనేవారు ఈ 3 ప్రాంతాల్లో ఓసారి ట్రై చేయొచ్చు
- పుణె నుంచి ధోలేరా వరకు ఈ మార్కెట్లు ఎందుకు పాపులర్?
- రూ.50 లక్షల బడ్జెట్‌కు ఈ ప్రాంతాలు ఎలా ఉన్నాయంటే?
Affordable Housing : సొంత ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ.50 లక్షల వరకే ఉందా? అయితే ప్రధాన నగరాల్లో ఇల్లు వెతికితే మీ బడ్జెట్‌కు సరిపోయే మంచి ఆప్షన్ దొరకడం కష్టమే. కానీ నగరానికి కాస్త దూరంగా.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల వైపు చూస్తే అదే బడ్జెట్‌లో ఫ్లాట్, ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వేలు, పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపై ఇప్పుడు కొనుగోలుదారుల ఫోకస్ పెరుగుతోంది. రూ.50 లక్షల బడ్జెట్‌లో ఇల్లు కొనాలనుకునేవారు ప్రస్తుతం పుణె, గుజరాత్‌లోని ధోలేరా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ మార్కెట్లను పరిశీలిస్తున్నారు.
పుణె.. ఐటీ కారిడార్‌కు దగ్గరగా..
పుణె పశ్చిమ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. బలేవాడి, బానెర్, హింజవాడి ప్రాంతాల్లో 2021-25 మధ్య ధరలు వరుసగా 64 శాతం, 58 శాతం, 51 శాతం పెరిగినట్లు రియల్ ఎస్టేట్ రంగంలో అంచనాలు ఉన్నాయి. మెట్రో లైన్-3 వంటి ప్రాజెక్టులతో పశ్చిమ కారిడార్ కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
దీంతో రూ.50 లక్షల బడ్జెట్ ఉన్నవారు ప్రధాన ప్రాంతాలకు బదులుగా వాటికి సమీపంలోని అభివృద్ధి చెందుతున్న మైక్రో మార్కెట్లలో చిన్న ఫ్లాట్లు, ఇతర నివాస ఆస్తులను పరిశీలించవచ్చు. ఐటీ ఉద్యోగుల కారణంగా అద్దె డిమాండ్ కూడా ఈ ప్రాంతాల్లో కీలకంగా మారుతోంది.
ధోలేరా.. తక్కువ ధర, కానీ రిస్క్ ఎక్కువ :
గుజరాత్‌లోని ధోలేరా SIRలో పారిశ్రామిక అభివృద్ధి, అహ్మదాబాద్-ధోలేరా ఎక్స్‌ప్రెస్‌వే, విమానాశ్రయ ప్రాజెక్టులతో అంచనాలు పెరుగుతున్నాయి. కొన్ని ఆమోదిత ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు చదరపు గజానికి సుమారు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఉన్నట్లు డెవలపర్లు చెబుతున్నారు.
కొన్ని ప్రాజెక్టుల్లో RERA ఆమోదిత స్టూడియో అపార్ట్‌మెంట్లు రూ.35.51 లక్షల నుంచి అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే, ధోలేరాలో పెట్టుబడికి భవిష్యత్ మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, వాస్తవ నివాస డిమాండ్ కీలకం. అందుకే ఇక్కడ రిస్క్ కూడా ఎక్కువగా ఉండొచ్చు.
NCRలో రూ.50 లక్షలకు ఛాన్స్ :
గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో కొన్ని నివాస ప్రాజెక్టుల్లో చదరపు అడుగుకు సుమారు రూ.3వేల నుంచి రూ. 4,500 ధరల రేంజ్ కనిపిస్తోంది. ఎక్స్‌ప్రెస్‌వేలు, మెరుగవుతున్న కనెక్టివిటీ ఈ ప్రాంతాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే, రూ.50 లక్షల బడ్జెట్ ఉందని ఏ ప్రాజెక్టునైనా కొనేయకండి.
రెరా రిజిస్ట్రేషన్, భూమి పత్రాలు, అనుమతులు, డెవలపర్ ట్రాక్ రికార్డ్, సమీపంలోని వాస్తవ మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా పరిశీలించాలి. అలాగే, 5 ఏళ్లలో 2ఎక్స్ రాబడి వంటి హామీలను నమ్మకుండా.. ప్రాంతంలో వాస్తవ డిమాండ్, ఉద్యోగ అవకాశాలు, కనెక్టివిటీ, భవిష్యత్ అభివృద్ధిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
