Amazon Freedom Sale 2025 : అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. ఈ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్స్, స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్లపై 70శాతం వరకు డిస్కౌంట్లు..!

Amazon Freedom Sale 2025 : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025 ఆగస్టు 1 నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై 70శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

Amazon Freedom Sale 2025 (Photo Credit : Amazon/Google )

Amazon Great Freedom Festival 2025 : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ప్రత్యేకించి ప్రైమ్ సభ్యులు జూలై 31 మధ్యాహ్నం 12 గంటల (Amazon Freedom Sale 2025) నుంచి అడ్వాన్స్ యాక్సెస్ పొందవచ్చు. ఈ సేల్ వివిధ రకాల ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.

అందులో హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై 70శాతం వరకు, బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్‌లపై 60శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎస్బీఐ కార్డ్ లావాదేవీలపై అదనంగా 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇతర అప్లియన్సెస్ సహా కొన్ని టాప్ డీల్‌లను మీకోసం అందిస్తున్నాం..

టాప్ ల్యాప్‌టాప్ డీల్స్ ఇవే :
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సందర్భంగా కొనుగోలుదారులు రోజువారీ, గేమింగ్ మోడల్‌లతో సహా వైడ్ రేంజ్ ల్యాప్‌టాప్‌లపై 45శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. హై పర్ఫార్మెన్స్ లేదా మిడ్ రేంజ్ ఆప్షన్ల కోసం మార్కెట్లో చూస్తుంటే HP, ASUS, Lenovo వంటి టాప్ బ్రాండ్‌లు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అమెజాన్ ఇప్పటివరకు వెల్లడించిన కొన్ని బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్‌లను ఓసారి పరిశీలిద్దాం.

  • లెనోవా థింక్‌బుక్ రూ. 46,990
  • అసూస్ వివోబుక్ (13వ జనరేషన్ i3 మోడల్) రూ. 33,990
  • హెచ్‌పీ ఓమినిబుక్ 5 (స్నాప్‌డ్రాగన్) రూ. 68,990
  • ఏసర్ ఆస్పైర్ లైట్ (i5) రూ. 44,990
  • హెచ్‌పీ విక్టస్ (i7 గేమింగ్ ల్యాప్‌టాప్) ధర రూ. 81,990.
  • ఏసర్ ALG (i7 గేమింగ్) రూ. 69,990
  • లెనోవో LOQ (Ryzen 5) రూ. 61,990
  • అసూస్ TUF (రైజెన్ 7) రూ. 82,990

గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి టాప్ టాబ్లెట్ డీల్స్ :
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సందర్భంగా శాంసంగ్, లెనోవో, రెడ్‌మి, వన్‌ప్లస్ వంటి బ్రాండ్ల టాబ్లెట్‌లు 60శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి. మీరు ఎంటర్‌టైన్మెంట్, వర్క్ లేదా చదువుల కోసం టాబ్లెట్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే అద్భుతమైన డీల్స్ చాలా ఉన్నాయి. ఈ సేల్ సమయంలో కొన్ని బెస్ట్ టాబ్లెట్ డీల్స్‌ పరిశీలిద్దాం..

Read Also : ICICI UPI Charges : బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. UPI పేమెంట్లపై ICICI బ్యాంకు కొత్త ఛార్జీలివే.. వారికి మాత్రమే..!

  • శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A9+ రూ. 16,999
  • లెనోవా ట్యాబ్ ప్లస్ రూ. 17,999 మాత్రమే
  • లెనోవా M11 రూ. 13,999 మాత్రమే

వన్‌ప్లస్ ప్యాడ్ 2, ఐప్యాడ్ ఎయిర్ M3, షావోమీ ప్యాడ్ 7, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE వంటి ప్రీమియం టాబ్లెట్‌లు కూడా తగ్గింపు ధరలకు పొందవచ్చు. అయితే, కచ్చితమైన డీల్ ధరలు ఇంకా ప్రకటించలేదు.

టాప్ హెడ్‌ఫోన్స్ డీల్స్ :
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో మీరు TWS ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లను 70శాతం వరకు తగ్గింపుతో పొందవచ్చు. మీరు బడ్జెట్-ఫ్రెండ్లీ వైర్‌లెస్ బడ్స్, నెక్‌బ్యాండ్‌లు లేదా ప్రీమియం ఓవర్-ఇయర్ హెడ్‌సెట్‌ల కోసం చూస్తున్నారా? ఈ సేల్ అద్భుతమైన హెడ్‌సెట్‌లను అందిస్తోంది. ఇప్పటివరకు వెల్లడైన కొన్ని బెస్ట్ హెడ్‌ఫోన్ డీల్స్ ఓసారి లుక్కేయండి.

బోట్ (boAt) ఎయిర్‌డోప్స్ ప్రైమ్ 701 ANC కేవలం రూ. 1,999కే

  • సెన్‌హైజర్ మొమెంటం 4 రూ. 18,990కు అమ్మకానికి వస్తుంది.
  • బోట్ నిర్వాణ ఐవీ ప్రో రూ. 4,499
  • మివీ DuoPods i2 ధర రూ. 699.
  • శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 ప్రో ధర రూ. 11,999
  • ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4, సౌండ్‌కోర్ బై అంకర్ క్యూ20ఐ, బోస్ క్యూసి అల్ట్రా హెడ్‌ఫోన్‌లు వంటి ప్రీమియం మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. కచ్చితమైన ధరలు ఇంకా వెల్లడి కాలేదు.

టాప్ స్మార్ట్‌వాచ్ డీల్స్ :
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సందర్భంగా స్మార్ట్‌వాచ్‌లు కూడా భారీ తగ్గింపుతో పొందవచ్చు. వేరబుల్ డివైజ్‌లను అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్. మీరు ఫ్లాగ్‌షిప్ మోడల్ లేదా బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ కోసం చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

వన్‌ప్లస్ వాచ్ 2R, వన్‌ప్లస్ వాచ్ 2, గెలాక్సీ వాచ్6 క్లాసిక్ ఎల్‌టీఈతో భారీ డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని స్మార్ట్‌వాచ్ డీల్స్ ఇలా ఉన్నాయి. వన్‌ప్లస్ వాచ్ 2 ధర రూ. 13,499కి లభిస్తుంది. ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా రూ. 1,599కి అమ్మకానికి వస్తుంది.