Top Smartphone Offers : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ మీకోసం.. డోంట్ మిస్..!
Amazon Great Indian Festival : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది.

Top Smartphone Offers During the Sale, Check Full Details
Amazon Great Indian Festival : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది.
Read Also : UPI 123Pay Limit : ఆర్బీఐ ఎంపీసీలో కీలక నిర్ణయాలు.. యూపీఐ లైట్, యూపీఐ 123పే లావాదేవీల పరిమితి పెంపు..!
అమెజాన్ సేల్ గత నెల 27న ప్రారంభం కాగా వినియోగదారులందరికీ అద్భుతమైన డీల్‌లను అందిస్తోంది. పర్సనల్ గాడ్జెట్ల నుంచి హోం, ఎంటర్టైన్మెంట్, భారీ అప్లియన్సెస్ వరకు అనేక రకాల ఎలక్ట్రానిక్‌లపై తగ్గింపు పొందవచ్చు. అదనంగా, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లు, కూపన్ డిస్కౌంట్లు, మరిన్ని అదనపు సేవింగ్స్ ఇతర ప్రొడక్టులపై కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు.. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఇన్స్టంట్ 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
కొన్ని పేమెంట్ల మెథడ్స్ ద్వారా కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ బెనిఫిట్స్ పొందవచ్చు. అన్ని ఆఫర్లపై నిబంధనలు షరతులు వర్తిస్తాయి. అమెజాన్ సేల్ సమయంలో కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ సేల్‌లో అత్యంత పాపులర్ డీల్‌లలో ఒకటి బేస్ ఐఫోన్ 13 మోడల్.. ఈ ఐఫోన్ 128జీబీ ఆప్షన్ ధర రూ. 79,900గా ఉంటే.. ఈ సేల్ సమయంలో కేవలం రూ. 42,999కు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. కస్టమర్లు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు ఈఎంఐ ఆప్షన్ల నుంచి రూ. 2,105 వరకు తగ్గింపు పొందవచ్చు.
16జీబీ + 256జీబీ స్టోరేజీ కలిగిన వన్‌ప్లస్ 12ఆర్ ధర రూ. 45,999 ఉంటే.. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 40,999కే ఆఫర్ చేస్తోంది. కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంకు కార్డ్‌లపై రూ. 3వేల డిస్కౌంట్ పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ధర రూ. 19,999కు అందిస్తోంది. కూపన్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో సహా సేల్ సమయంలో ఈ ఫోన్‌ను రూ. 16,499 తక్కువ ధరకే పొందవచ్చు.