UPI 123Pay Limit : ఆర్బీఐ ఎంపీసీలో కీలక నిర్ణయాలు.. యూపీఐ లైట్, యూపీఐ 123పే లావాదేవీల పరిమితి పెంపు..!
UPI 123Pay Limit : ఆర్బీఐ యూపీఐ 123పే పేమెంట్లపై ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 10వేలకు పెంచింది. ఈ కొత్త ఫీచర్ ఫోన్ వినియోగదారులకు లావాదేవీల పరిమితిని రెట్టింపు చేసింది.

RBI raises UPI Lite, UPI 123Pay limits (Image Source : Google )
UPI 123Pay Limit : ప్రముఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లేటెస్ట్ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సిస్టమ్‌లో గణనీయమైన మార్పులను ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ మొత్తం రెండు కీలక యూపీఐ సర్వీసులకు లావాదేవీ పరిమితులను పెంచింది. యూపీఐ 123పే, యూపీఐ లైట్ మిలియన్ల కొద్దీ వినియోగదారులకు మరింత ప్రయోజనాలను అందించనుంది.
దేశంలో ఇప్పటికే డిజిటల్ పేమెంట్ల ద్వారా యూపీఐ భారత ఆర్థిక రంగాన్ని మార్చింది. యూపీఐ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా యూపీఐ (UPI123Pay)లో ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 5వేల నుంచి పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అందులో రూ. 10వేలు యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ. 2వేల నుంచి రూ. 5వేలకు, ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 500 నుంచి రూ. వెయ్యికి పెంచినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
ఆర్బీఐ యూపీఐ 123పే పేమెంట్లపై ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 10వేలకు పెంచింది. ఈ కొత్త ఫీచర్ ఫోన్ వినియోగదారులకు లావాదేవీల పరిమితిని రెట్టింపు చేసింది. అదనంగా, యూపీఐ లైట్ వ్యాలెట్ల పరిమితిని రూ. 2వేల నుంచి రూ. 5వేలకు పెంచింది. వినియోగదారులు చిన్న మొత్తంలో డిజిటల్ పేమెంట్ల కోసం యూపీఐ లైట్‌ను విస్తృతంగా వాడుతున్నారు. సామాన్య యూజర్లందరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు లేదా హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ లేని వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
యూపీఐ 123Pay అంటే ఏమిటి? :
మార్చి 2022లో యూపీఐ 123పే సర్వీసు ప్రారంభమైంది. దేశంలోని 400 మిలియన్ల ఫీచర్ ఫోన్ యూజర్లకు డిజిటల్ పేమెంట్లు యాక్సెస్ చేసుకునేలా అందుబాటులోకి వచ్చింది. ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా క్రియేట్ చేసింది. సాధారణ యూపీఐ సర్వీసులు కాకుండా స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం. యూపీఐ 123పే ఫీచర్ ఫోన్‌లను కలిగి ఉన్న యూజర్లను సాధారణ పద్ధతుల ద్వారా లావాదేవీలు చేసేందుకు అనుమతిస్తుంది.
నాలుగు పద్ధతుల్లో యూపీఐ 123పే సేవలు :
ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) : యూపీఐ వినియోగదారులు ముందుగా సెట్ చేసిన నంబర్‌కు కాల్ చేయవచ్చు. పేమెంట్ పూర్తి చేయడానికి మల్టీ లాంగ్వేజీలలో వాయిస్ ప్రాంప్ట్‌లను పొందవచ్చు.
మిస్డ్ కాల్ పేమెంట్స్ : వినియోగదారులు మర్చంట్-నిర్దిష్ట నంబర్‌కు మిస్డ్ కాల్ చేస్తారు. యూపీఐ పిన్‌ని ఉపయోగించి పేమెంట్ అథెంటికేషన్ కోసం వారికి కాల్ చేస్తుంది.
ఫీచర్ ఫోన్లలో యాప్ ఆధారిత పేమెంట్లు : డబ్బు పంపడం, తిరిగి పొందడం వంటి ప్రాథమిక పేమెంట్లను అందించే యూపీఐ యాప్.
సౌండ్ ఆధారిత పేమెంట్లు : కాంటాక్ట్‌లెస్ పేమెంట్లను సులభతరం చేసే సౌండ్ వేవ్‌లను ఉపయోగించి మర్చంట్ డివైజ్‌లో వారి ఫోన్‌ను ట్యాప్ చేసేందుకు ఈ ఫీచర్ యూజర్లను అనుమతిస్తుంది.
యూపీఐ 123పేని ఎలా సెటప్ చేయాలంటే? :
ఫీచర్ ఫోన్ యూజర్లు (*99#) డయల్ చేయడం ద్వారా వారి బ్యాంకును ఎంచుకోవాలి. వారి అకౌంట్ లింక్ చేసే సూచనలతో యూపీఐ 123పే సర్వీసులను సెటప్ చేయవచ్చు. యూపీఐ పిన్‌ని క్రియేట్ చేసే వినియోగదారులకు వారి డెబిట్ కార్డ్ వివరాలు అవసరం. సేఫ్, ఇంటర్నెట్ రహిత లావాదేవీలను పూర్తి చేయొచ్చు.
యూపీఐ లైట్ :
చిన్న మొత్తంలో లావాదేవీలను మరింత సౌకర్యవంతంగా యూపీఐ లైట్ ప్రవేశపెట్టింది. వ్యాలెట్ లిమిట్ ఇప్పుడు రూ. 5వేలకు పెంచడంతో వినియోగదారులు తమ ఫోన్లలో నేరుగా డబ్బును స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సాయంతో ప్రతి లావాదేవీపై బ్యాంక్ సర్వర్‌ను యాక్సెస్ చేయాల్సిన అవసరం ఉండదు. రోజువారీ కొనుగోళ్లకు కిరాణా లేదా రవాణా ఛార్జీలపై పేమెంట్లను వేగంగా పూర్తి చేయొచ్చు. యూపీఐ లైట్ చిన్న లావాదేవీలకు బెస్ట్ సర్వీసు అని భావిస్తున్నారు. ముఖ్యంగా పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఈ సర్వీసుతో వినియోగదారులు అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఆర్బీఐ ఎంపీసీ కీలక ప్రకటనలివే :
యూపీఐ పరిమితుల్లో మార్పులతో పాటు ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటును 6.5శాతం వద్ద మార్చకుండా యథాతథంగా అలానే ఉంచింది. ఎంపీసీ సమావేశంలోని నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 2023 ఫిబ్రవరి నుంచి సెంట్రల్ బ్యాంకు ఈ రేటును కొనసాగిస్తూ వస్తోంది.
రేపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవడం వరుసగా ఇదే పదోసారి. ప్రస్తుత రేటును కొనసాగించడం వల్ల మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అవసరమైన వెసులుబాటు లభిస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు. ఇంధన వ్యయాలు పెరగడం వంటి గ్లోబల్ కారకాల కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని 4శాతం లక్ష్యం లోపల ఉంచాలనే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.
Read Also : RBI Repo Rate : ఆర్బీఐ రెపో రేటు యథాతథం.. వారికి నిరాశను మిగిల్చిన ఆర్బీఐ గవర్నర్ ప్రకటన