Amazon-Flipkart Sale Alert : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్స్.. ఈ కార్డులతో కొంటే క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లతో భారీ సేవింగ్స్!

Amazon-Flipkart Sale Alert : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026లో SBI, Axis, ICICI కార్డులపై లభించే డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ముఖ్యమైన కండిషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Amazon-Flipkart Sale Alert

  • అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్ సేల్.. మీ కార్డులో ఈ ఆఫర్ ఉందా? చెక్ చేయండి
  • ఎస్బీఐ, యాక్సస్, ఐసీఐసీఐ కార్డులతో పండుగ షాపింగ్..
  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్స్.. కార్డ్‌తో కొంటే అదనపు లాభాలు
  • షాపింగ్‌కు ముందు ఆగండి.. మీ డెబిట్, క్రెడిట్ కార్డుపై భారీ డిస్కౌంట్లు

Amazon-Flipkart Sale Alert : పండుగ షాపింగ్‌కు రెడీ అవుతున్నారా? అయితే, అక్టోబర్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్స్ మీకో అద్భుతమైన అవకాశం.. ముఖ్యంగా డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి బ్యాంకులు స్పెషల్ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ వంటి ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తున్నాయి.

అయితే, కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను తప్పక గమనించాలి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 8న, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులతో పాటు ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు అక్టోబర్ 8 నుంచే ముందస్తు సేల్ మొదలు కానుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఏయే కార్డులకు బెనిఫిట్స్? :
ఫ్లిప్‌కార్ట్ విక్రయాల్లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన అర్హత ఉన్న కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సహబ్రాండ్ క్రెడిట్ కార్డుపై కూడా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అదనంగా సూపర్.మనీ (Super.Money) ద్వారా చేసే ఫస్ట్ పేమెంట్‌పై 10 శాతం క్యాష్ బ్యాక్ లభించే అవకాశం ఉంది. అయితే కండిషన్స్ అప్లయ్ అవుతాయి.

Read Also : Gold Rates : గోల్డ్‌పై BofA అలర్ట్.. రూ.1.10 లక్షల దిగువకు బంగారం? కొనేవారికి ఛాన్స్.. ఇన్వెస్టర్లకు టెన్షన్!

అమెజాన్‌లో ఎస్‌బీఐ కార్డులతో ఆదా :
అమెజాన్ పండుగ విక్రయాల్లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు కస్టమర్లకు 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కొన్ని నిబంధనల ప్రకారం నెలవారీ ఈఎంఐ పేమెంట్లపై కూడా ఈ బెనిఫిట్ వర్తించవచ్చు.

కొన్ని కార్డులతో కొనుగోళ్లపై 35 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. గరిష్ఠంగా రూ.150 వరకు పొందొచ్చు. అమెజాన్ పే లేటర్ ద్వారా కొనుగోళ్లపై మరో 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లు అమెజాన్ కొనుగోళ్లపై ప్రైమ్ సభ్యత్వం ఉన్నవారికి 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

కొనేముందు జాగ్రత్త :
10 శాతం వరకు తగ్గింపు అంటే ప్రతి కొనుగోలుపై పూర్తి 10 శాతం తగ్గింపు వస్తుందని కాదు. గరిష్ఠ తగ్గింపు పరిమితి, కనీస కొనుగోలు విలువ, కార్డు అర్హత, ఈఎంఐ పేమెంట్ నిబంధనలు వంటి షరతులు ఉండొచ్చు. అందుకే పేమెంట్ చేసే ముందు ఆఫర్ ఏంటి? ఎంత డిస్కౌంట్ వస్తుంది? అనే పూర్తి వివరాలను తెలుసుకున్నాకే కొనుగోలు చేయడం మంచిది.