Amazon Great Indian Festival Sale : అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై ఊహించని డిస్కౌంట్లు..!
Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా గెలాక్సీ Z ఫోల్డ్ 7పై బెస్ట్ డీల్స్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
- Sreehari A
- Published on- October 8, 2026 / 01:10 PM IST
Amazon Great Indian Festival Sale
- అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం
- శాంసంగ్, ఒప్పో ఫైండ్ X9, గెలాక్సీ Z ఫోల్డ్ 7పై బెస్ట్ డీల్స్
- ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై టాప్ రేంజ్ డీల్స్ ఇవే
Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి పండగే.. పండుగ సీజన్‌కు ముందే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ భారీ ఆఫర్ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలన్నా లేదా మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలన్నా ఇదే బెస్ట్ టైమ్.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై టాప్ రేంజ్ డీల్స్ (Amazon Great Indian Festival Sale) అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ నుంచి తగ్గింపు ధరకు ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ (12GB + 256) వేరియంట్ ప్రస్తుతం రూ. 94,999 తగ్గింపు ధరకే లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేస్తే మరింత ధర తగ్గించుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.9-అంగుళాల డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో ఏఐ ఫొటోగ్రఫీతో 200MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ కూడా ఉంది.
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా 5జీ :
ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా 5జీ అసలు ధర రూ. 2,49,999 ఉండగా ఇప్పుడు రూ. 1,69,999కే లభిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ డెబిట్ కార్డులతో రూ. 17వేల వరకు అదనంగా తగ్గింపు పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు.
ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా, 200MP పోర్ట్రెయిట్ టెలిఫోటో 50MP అల్ట్రా-వైడ్ కెమెరాతో హాసెల్‌బ్లాడ్ మాస్టర్ కెమెరా సిస్టమ్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 100W వైర్డ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 7,050mAh బ్యాటరీతో వస్తుంది. 8K వీడియో రికార్డింగ్ IP69 మన్నికను కూడా అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 5జీ :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 5జీ ఫోన్ (12GB + 256GB) వేరియంట్, రూ. 2,04,999 బదులుగా రూ. 1,29,999కే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత తగ్గించుకోవచ్చు.
ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 12GB ర్యామ్‌తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో ఏఐ ఆధారిత ప్రోవిజువల్ ఇంజిన్‌తో 200MP మెయిన్ కెమెరా, ఆర్మర్ అల్యూమినియం, ఫ్రేమ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
