×
Ad

Oppo Reno 13 Pro Price : ఆఫర్ అంటే ఇది భయ్యా.. ఈ ఒప్పో రెనో 13 ప్రోపై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Oppo Reno 13 Pro : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా ఒప్పో రెనో 13 ప్రోపై అద్భుతమైన ధర తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. ఇప్పుడు ఈ ఒప్పో ఫోన్ 16వేల తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ మీకోసమే..

Oppo Reno 13 Pro Price (Image Credit To Original Source)

  • ఒప్పో రెనో 13 ప్రో పై రూ.16వేలు డిస్కౌంట్
  • అసలు ధర రూ.49,999 నుంచి రూ.33,999కి తగ్గింపు
  • బ్యాంక్ ఆఫర్లతో ధర రూ.32,999కు తగ్గింపు
  • 6.83-అంగుళాల డిస్‌ప్లే, 12GB ర్యామ్, 5,800mAh బ్యాటరీ

Oppo Reno 13 Pro Price : కొత్త ఒప్పో ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. మీరు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఒప్పో రెనో 13 ప్రో కొనేసుకోవడం బెటర్.. ఎందుకంటే.. ఈ ఒప్పో ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో బిగ్ స్క్రీన్‌ మాత్రం హైలెట్ అని చెప్పొచ్చు.

ఒప్పో రెనో 13 ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్‌ కూడా ఉంది. అయితే, అమెజాన్‌లో ప్రస్తుత డీల్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 35వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఆఫర్ ముగిసేలోగా కొనేసుకోవడం బెటర్.

అమెజాన్‌లో ఒప్పో రెనో 13 ప్రో డీల్ :
రూ.49,999కే లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.33,999కే లిస్ట్ అయింది. అంటే రూ.16,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా రూ.32,999కి ఒప్పో ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

Oppo Reno 13 Pro Price (Image Credit To Original Source)

అమెజాన్‌లో కేవలం రూ. 1,195 నుంచి ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసే యూజర్లకు రూ. 32,100 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ ధర అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Motorola Razr 60 Ultra : ఇది కదా డిస్కౌంట్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈసారి ఏకంగా రూ. 20వేలు డిస్కౌంట్.. ఎలాగంటే?

ఒప్పో రెనో 13 ప్రో స్పెసిఫికేషన్లు :

ఒప్పో రెనో 13 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల ప్యానెల్‌తో వస్తుంది. స్క్రీన్ 1,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఇంకా, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పాటు 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీని అందిస్తుంది. బాక్స్ వెలుపల స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ఓఎస్ 15పై రన్ అవుతుంది. బ్యాటరీ పరంగా, 5,800mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఒప్పో రెనో 13 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో సెన్సార్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP66, IP68, IP69 సర్టిఫికేట్లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.