Amazon Summer Sale 2026 : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఈ బ్రాండ్ ల్యాప్‌టాప్‌లపై ఊహించని డిస్కౌంట్లు.. ఆపిల్, డెల్ ఏదైనా కొనేయొచ్చు!
Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సేల్‌లో భాగంగా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Apple, Dell, and Lenovo Laptops ( Image Credit : AI )
- ఈ సేల్ పలు ప్రొడక్టు కేటగిరీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది
- ఆపిల్, డెల్ వంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు
- అమెజాన్ సేల్‌లో అనేక ప్రొడక్టులపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు
Amazon Great Summer Sale 2026 : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్ వంటి పలు రకాల ప్రొడక్టులపై (Amazon Summer Sale 2026) అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల వంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అమెజాన్ సేల్ సమయంలో ఆపిల్, డెల్, లెనోవా వంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లను తక్కువ ధరలకు కొనేసుకోవచ్చు.
ఈ సేల్‌లో డెల్ 15 ల్యాప్‌టాప్ ధర రూ. 90,474 నుంచి రూ. 79,990కే లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6-అంగుళాల FHD స్క్రీన్ ఉంది. ప్రాసెసర్‌గా ఇంటెల్ ఆరో లేక్ కోర్ అల్ట్రా 5 ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి ఫీచర్లు కూడా ఉన్నాయి.
అమెజాన్ సేల్‌లో ఆసుస్ వివోబుక్ 15 అసలు ధర రూ. 87,990 ఉండగా ఇప్పుడు రూ. 71,990కే లభ్యమవుతోంది. ఆసుస్ జెన్‌బుక్ 14 ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 1,17,990గా ఉండగా రూ. 85,990కే లభిస్తోంది. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 OLED లిస్ట్ ధర రూ. 1,23,090 నుంచి రూ. 84,990కే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ సేల్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అనేక ప్రొడక్టులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
