Best Smartphone Deals : వన్‌ప్లస్ 8Tపై సూపర్ ఆఫర్.. 48MP DSLR రేంజ్ కెమెరా ఫోన్ జస్ట్ రూ.21,000కే.. డోంట్ మిస్!
Best Smartphone Deals : వన్‌ప్లస్ 8Tపై అద్భుతమైన ఆఫర్.. 48MP డీఎస్ఎల్ఆర్ వంటి కెమెరా, 4500mAh బ్యాటరీ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. ఎలా పొందాలంటే?
Best Smartphone Deals ( Image Credit : AI )
- ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 8T అతి తక్కువ ధరకే లభిస్తోంది
- ఈ ఫోన్‌పై నేరుగా రూ. 21 వేల వరకు డిస్కౌంట్
- ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులతో మరింత తగ్గింపు
Best Smartphone Deals : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు వన్ ప్లస్ అభిమాని అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే.. అతి తక్కువ ధరకే వన్‌ప్లస్ 8T సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ లాంచ్ ధర కన్నా ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది.
కంపెనీ ప్రకారం.. వన్‌ప్లస్ 8టీలో 48MP డీఎస్ఎల్ఆర్ వంటి కెమెరా, 4500mAh బ్యాటరీ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై (Best Smartphone Deals) అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్ 8Tపై బెస్ట్ ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ 8టీ ధర తగ్గింపు ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు వన్‌ప్లస్ 8టీ లభిస్తోంది. ఈ ఫోన్‌ను రూ. 49,999 ధరకు లాంచ్ చేయగా, ప్రస్తుతం రూ. 28,200కే లభిస్తోంది. ఈ ఫోన్‌పై అసలు ధర నుంచి నేరుగా రూ. 21వేలు తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తగ్గింపు పొందవచ్చు.
వన్‌ప్లస్ 8టీ బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్ :
వన్‌ప్లస్ 8T ఫోన్ కొనుగోలుతో బ్యాంక్ ఆఫర్ నుంచి బోనస్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 1,885 డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ఈ ఫోన్‌ను అసలు ధర నుంచి రూ.26,315 నుంచి రూ. 23వేల వరకు తక్కువకు సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ 8టీ స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 8టీ 5జీ ఫోన్ 6.55-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్తో రన్ అవుతుంది. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 4,500mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 160.70mm పొడవు, 74.10mm వెడల్పు, 8.40mm మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
వన్‌ప్లస్ 8టీ 5జీలో 48MP ప్రైమరీ కెమెరా, 16MP సెకండరీ కెమెరా, 5MP సెకండరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై, బ్లూటూత్, NFC, జీపీఎస్ ఉన్నాయి. సెన్సార్లలో ఫేస్ అన్‌లాక్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మాగ్నెటోమీటర్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ ఉన్నాయి.
