PM Kisan Yojana : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 23వ వాయిదాపై ఉత్కంఠ.. ఈ రైతులకు రూ. 2వేలు రావడం కష్టం.. ఎందుకంటే?
PM Kisan Yojana : పీఎం కిసాన్ 23వ వాయిదా ఎప్పుడు వస్తుందో తెలుసా? రూ. 2వేలు బ్యాంకు ఖాతాలో పడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. ఈసారి వాయిదా ఆలస్యానికి అసలు కారణాలంటే ఇప్పుడు చూద్దాం..
PM Kisan 23rd installment ( Image Credit : AI )
- పీఎం కిసాన్ 23వ వాయిదా ఎప్పుడు విడుదల కానుంది?
- ఈ రైతులకు రూ. 2వేలు ఎందుకు ఆలస్యమవుతుంది?
- కేవైసీ, బ్యాంకు ఖాతా, ఆధార్ లింక్ చేయకుంటే డబ్బులు రావా?
PM Kisan Yojana 23rd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ పథకం 23వ విడత అతి త్వరలో విడుదల కాబోతుంది. ఈ వాయిదా రూ. 2వేల కోసం లబ్ధిదారు రైతులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, రైతులు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు కారణంగా రావాల్సిన వాయిదా డబ్బులు నిలిచిపోతుంటాయి.
అందులో ప్రధానంగా కేవైసీ పూర్తి చేయకపోవడం లేదా మీ ఆధార్ మీ బ్యాంకు ఖాతాతో లింక్ కాకపోవడం వంటి చిన్న పొరపాట్ల కారణంగా పీఎం కిసాన్ వాయిదా నిలిచిపోతుంది. ఇంతకీ ఈ సమస్యలను త్వరగా ఎలా పరిష్కరించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆలస్యానికి అసలు కారణాలివే :
ఇప్పుడు రైతులందరి దృష్టి పీఎం కిసాన్ 23వ వాయిదాపైనే ఉంది. అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే.. 23వ వాయిదా ఎప్పుడు వస్తుంది? రూ. 2వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు డిపాజిట్ అవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. ఇప్పటికే 23వ వాయిదా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, కొంతమంది రైతులు తమ కేవైసీని పూర్తి చేయకపోతే వారికి వాయిదా ఇంకా ఆలస్యం కావొచ్చు.
Read Also : Summer AC Tips : మీ ఇంట్లో AC నుంచి వాటర్ లీక్ అవుతుందా? అసలు కారణాలివే.. ఎలా ఫిక్స్ చేయాలంటే?
22వ వాయిదా ఎందుకు జమ కాలేదు? :
గత 22వ వాయిదా ఎందుకు డిపాజిట్ కాలేదో తెలియదా? కొన్ని సాధారణ తప్పుల కారణంగా రావాల్సిన వాయిదా ఆగిపోతుంది. పీఎం కిసాన్ డబ్బులు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే ఏయే తప్పులను నివారించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీ KYCని పూర్తి చేయండి :
మీరు మీ ఖాతా కేవైసీని పూర్తి చేయకపోతే ముందుగా పూర్తి చేయాలి. మీ కేవైసీ అప్డేట్ అయిన తర్వాతే డబ్బు డిపాజిట్ అవుతుంది. మీరు ఇది చేయకపోతే మీకు 23వ విడత అందదు.
ఆధార్ లింకింగ్ ఇష్యూ :
మీ ఆధార్ లింకింగ్ సమస్య ఉంటే.. మీ ఖాతాలోకి డబ్బు పడదు. మీరు చేయాల్సిన ఫస్ట్ పని మీ బ్యాంకు ఖాతా మీ ఆధార్ కార్డుతో సరిగ్గా లింక్ అయిందో లేదో సరిచూసుకోవడమే..
రెండు వాయిదాలు ఒకేసారి అందుతాయా? :
గతంలో ఒక వాయిదా మిస్ అయినా ఒకేసారి రెండు వాయిదాలు పొందవచ్చా? అంటే అలా వచ్చే అవకాశం ఉంది. కానీ, అంతకన్నా ముందు మీ దరఖాస్తులో సమర్పించిన వివరాలన్నీ సరైనవేనా అని సరిచూసుకోవాలి.
