Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. అతి తక్కువ ధరకే వన్‌ప్లస్, ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు కొనేసుకోవచ్చు.. గెట్ రెడీ..!

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా వన్‌ప్లస్, శాంసంగ్, ఐఫోన్లపై భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. అతి తక్కువ ధరకే వన్‌ప్లస్, ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు కొనేసుకోవచ్చు.. గెట్ రెడీ..!

Amazon Great Summer Sale

Updated On : April 26, 2025 / 1:55 PM IST

Amazon Great Summer Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో అతి త్వరలో కొత్త సేల్ ప్రారంభం కానుంది. గ్రేట్ సమ్మర్ సేల్ 2025 తేదీని కూడా ప్రకటించింది. ఈ సేల్‌లో ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి భారీ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు లభ్యం కానున్నాయి.

మీరు ఈ బ్రాండ్ల ఫోన్లను సరసమైన ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ రాబోయే సేల్ కోసం అమెజాన్ ఇప్పటికే స్పెషల్ పేజీని కూడా క్రియేట్ చేసింది. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న మరిన్ని స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం..

Read Also : Amazon Great Summer Sale : అమెజాన్‌ గ్రేట్ సమ్మర్ సేల్ డేట్, టైమ్ ఇదిగో.. సేవ్ చేసి పెట్టుకోండి.. ఈ స్మార్ట్‌ఫోన్లపైనే క్రేజీ డీల్స్..!

గ్రేట్ సమ్మర్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ల జాబితా :
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చే నెల మే 1న ప్రారంభం కానుంది. ఈ సేల్ ముగింపు తేదీ ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15, ఐక్యూ నియో 10R 5G, వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ నార్డ్ CER లైట్ 5G, శాంసంగ్ గెలాక్సీ A35, రియల్‌మి నార్జో 80x వంటి అనేక ఫోన్‌లు చౌకైన ధరకు అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా :
అమెజాన్‌లో జరుగుతున్న ఈ సేల్‌లో ప్రతి ధర సెగ్మెంట్‌లో బెస్ట్ డీల్స్ పొందవచ్చు. లిస్టింగ్ ప్రకారం.. గత ఏడాదిలో రిలీజ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కూడా లిస్టులో ఉంది. మీరు చౌకైన ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరాతో వస్తుంది.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ చౌకైన ధరకే :
మీరు ఈ సేల్‌లో ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13R సరసమైన ధరకే కొనుగోలు చేయవచ్చు. డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో 48MP కెమెరాను కలిగి ఉంది. వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, ఇటీవల లాంచ్ అయిన వన్‌ప్లస్ 13R కూడా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

Read Also : TS SSC Results 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడంటే? ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!

ఇటీవలే రిలీజైన ఐక్యూ Z10x 5G, రియల్‌మి నార్జో 80x 5G కూడా రాబోయే సేల్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. మీరు చౌకైన ధరకు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, మీరు రెడ్‌మి A4 5G, టెక్నో పాప్ 9 వంటి ఫోన్‌లను కూడా రూ. 10వేల లోపు ధరకే కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్, క్యాష్‌బ్యాక్, కూపన్ డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు.