TS SSC Results 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడంటే? ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!

TS SSC Results 2025 : తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. 10వ తరగతి ఫలితాలు ఈ నెలాఖరులో విడుదల అయ్యే అవకాశం ఉంది. టెన్త్ క్లాస్ మార్క్ మెమో ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

TS SSC Results 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడంటే? ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!

TS SSC Results 2025

Updated On : April 26, 2025 / 1:27 PM IST

TS SSC Results 2025 : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో 2025 టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు TS SSC రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఈ ఫలితాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Read Also : Amazon Great Summer Sale : అమెజాన్‌ గ్రేట్ సమ్మర్ సేల్ డేట్, టైమ్ ఇదిగో.. సేవ్ చేసి పెట్టుకోండి.. ఈ స్మార్ట్‌ఫోన్లపైనే క్రేజీ డీల్స్..!

10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. గత ఏడాది ఫలితాల ఆధారంగా పరిశీలిస్తే.. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాలు ఈ నెలాఖరులో లేదా మే ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది.

టెన్త్ రిజల్ట్స్ 2025 తేదీ (అంచనా) :
గత సంవత్సరాలను పరిశీలిస్తే.. తెలంగాణ టెన్త్ ఫలితాలు 2024 ఏప్రిల్ 30న ప్రకటించారు. 2023 ఫలితాలు మే 10న వెలువడ్డాయి. దీని ప్రకారం.. 2025లో టెన్త్ ఫలితాలు ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ, మీడియా కథనాల ప్రకారం.. ఈ నెల 28వ తేదీ లేదా 29వ తేదీల్లో తెలంగాణ SSC రిజల్ట్స్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

గత ఏడాది టెన్త్ ఫలితాలు గణాంకాలివే :
2024లో 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 91.31శాతంగా ఉంది. బాలికలు అబ్బాయిల కన్నా మెరుగ్గా రాణించారు. బాలికలు 93.23శాతం ఉత్తీర్ణత శాతం నమోదు చేయగా, బాలురు 89.42శాతంగా ఉన్నారు. జిల్లాల విషయానికొస్తే.. నిర్మల్ 99.05శాతం ఉత్తీర్ణతతో ముందంజలో ఉండగా, సిద్ధిపేట (98.65శాతం) రాజన్న సిరిసిల్ల (98.27శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

TS SSC రిజల్ట్స్ 2025 ఎక్కడ చెక్ చేయాలి? :
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ TS SSC మార్క్స్ మెమో 2025ను తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ల (bse.telangana.gov.in, bseresults.telangana.gov.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS SSC రిజల్ట్స్ 2025 ఎలా చెక్ చేయాలి? :

Read Also : Xiaomi 14 Series : షావోమీ లవర్స్‌ మీకోసమే.. ఈ షావోమీ 3 ఫోన్లలో ఏది కొంటే బెటర్? ఫీచర్లు ఎందులో బాగున్నాయంటే?

  • మీ రిజల్ట్స్ కోసం మార్కుల మెమోను ఇలా డౌన్‌లోడ్ చేయొచ్చు.
  • అధికారిక వెబ్‌సైట్‌ (bse.telangana.gov.in)ను విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో TS SSC రిజల్ట్స్ 2025 కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
  • లాగిన్ పేజీలో మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
  • మీ రిజిల్ట్స్ చూసేందుకు Submit బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.