Amazon Prime Day Sale 2025 : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్‌లో బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్ డీల్స్ మీకోసం.. ఓసారి లుక్కేయండి..!
Amazon Prime Day Sale 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా గేమింగ్ ల్యాప టాప్స్‌పై అదిరిపోయే డీల్స్ ఆఫర్ చేస్తోంది.

Best gaming laptop deals
Amazon Prime Day Sale 2025 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ సందర్భంగా పవర్‌ఫుల్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ధరలు భారీగా తగ్గాయి. గేమింగ్, క్రియేటివిటీ (Amazon Prime Day Sale 2025) కోసం కొత్త ల్యాప్‌టాప్ తీసుకోవాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ అమెజాన్ సేల్‌లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుత 3 బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై అమెజాన్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఏసర్ నైట్రో V 16, HP స్మార్ట్ చాయిస్ ఒమెన్, లెనోవో స్మార్ట్‌చాయిస్ LOQ వంటి గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
ఏసర్ నైట్రో V 16 :
ఏసర్ నైట్రో V 16 ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i5-14450HX 14వ జనరేషన్ ప్రాసెసర్‌తో వస్తుంది. 6GB GDDR6 VRAMతో NVIDIA GeForce RTX 4050 GPUతో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్, 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీతో 16-అంగుళాల WUXGA IPS డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్‌లో రన్ అవుతుంది. అబ్సిడియన్ బ్లాక్ కలర్‌లో వస్తుంది. 2.5 కిలోల బరువు ఉంటుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కూడా కలిగి ఉంది. మిడ్-రేంజ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా ఏసర్ నైట్రో V 16 ల్యాప్‌టాప్ రూ. 81,290 ధరకు లభిస్తుంది.
HP స్మార్ట్‌చాయిస్ ఒమెన్ :
ఈ హెచ్‌పీ గేమింగ్ ల్యాప్‌టాప్ AMD రైజెన్ 7, 7840HS ప్రాసెసర్, 8GB RTX 4060 GPUతో రన్ అవుతుంది. అద్భుతమైన థర్మల్‌లతో హై-ఎండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 16GB DDR5 ర్యామ్, 1TB SSD, 16.1-అంగుళాల ఫుల్ HD IPS డిస్‌ప్లే (165Hz, 300 నిట్స్)తో వస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ RGB బ్యాక్‌లిట్ కీబోర్డ్, AI ఆప్టిమైజేషన్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. విండోస్ 11, మైక్రోసాఫ్ట్ ఆఫీసు 2021 ప్రీ-ఇన్‌స్టాల్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్‌లో భాగంగా HP స్మార్ట్‌చాయిస్ ఒమెన్ ధర రూ. 1,02,990కు లభిస్తోంది.
లెనోవో స్మార్ట్‌చాయిస్ :
లెనోవో LOQలో AMD రైజెన్ 7 ల్యాప్‌టాప్ 7435HS ప్రాసెసర్, 6GB VRAMతో NVIDIA RTX 4050 గ్రాఫిక్స్ ఉన్నాయి. 24GB ర్యామ్, 512GB SSDతో కాన్ఫిగర్ అయింది. 100శాతం sRGB కలర్ 15.6-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది.
విండోస్ 11, మైక్రోసాఫ్ట్ ఆఫీసు హోమ్ 2024, 3-నెలల Xbox గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. 2.4 కిలోల బరువు, లెనోవో కూలింగ్ సిస్టమ్‌తో ఈ డివైజ్ పర్ఫార్మెన్స్, పోర్టబిలిటీతో వస్తుంది. ఈ ప్రైమ్ డే సేల్ సందర్భంగా లెనోవో LOQ ల్యాప్‌టాప్ రూ. 80,990 ధరకు అందుబాటులో ఉంది.