Amazon vs Flipkart vs Vijay Sales : ఇండిపెండెన్స్ డే షాపింగ్‌కు రెడీనా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో అదిరిపోయే డిస్కౌంట్లు!

Amazon vs Flipkart vs Vijay Sales : స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్‌లో షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Amazon vs Flipkart vs Vijay Sales ( Image Credit : AI )

  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో సూపర్ డీల్స్
  • ఇండిపెండెన్స్ డే సేల్‌లో భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు
  • క్రెడిట్ కార్డ్ ఉంటే మరింత సేవింగ్, ఆఫర్లు చూస్తే వదిలిపెట్టరు

Amazon vs Flipkart vs Vijay Sales : ఇండిపెండెన్స్ డే సేల్.. ఆఫర్ల సందడి మొదలైంది.. ముఖ్యంగా మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీలు, హోం అప్లియన్సెన్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా కొత్త ఫోన్, టీవీ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొనాలని చూస్తున్నారా? ఇదే బెస్ట్ టైమ్..

ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్ కార్ట్, విజయ్ సేల్స్ పోటీపడి మరి ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కస్టమర్లకు (Amazon vs Flipkart vs Vijay Sales) ఎందులో కొనాలో డిసైడ్ అవ్వడం కష్టమే.. భారీ డిస్కౌంట్ కనపడగానే వెంటనే ఆర్డర్ చేయొద్దు.. అన్ని ఆఫర్లను చూసిన తర్వాతే మీకు నచ్చిన బెస్ట్ డీల్ ఎంచుకోవడం బెటర్..

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్ ఈ 3 ప్లాట్‌ఫామ్‌లలోనూ ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. మరెన్నో క్రెడిట్ కార్డు డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ ప్లాట్ ఫారంలో బెస్ట్ డీల్ ఏంటి? ఎందులో ధర తక్కువ బెనిఫిట్స్ ఎక్కువ అనేది కంపేర్ చేశాకే కొనేసుకోండి.

మూడు ప్లాట్‌ఫారాల్లో బెస్ట్ డీల్స్ ఇవే :

అమెజాన్‌లో HDFC కార్డులు, ఈజీ ఈఎంఐపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, గరిష్ఠంగా రూ. 2వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ప్రైమ్ సభ్యులకు అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్లు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, అప్లయెన్సులకు వర్తిస్తాయి.

Read Also : Motorola G Max Launch : బ్యాటరీ బీస్ట్ వచ్చేసింది.. కొత్త మోటోరోలా G మ్యాక్స్ అదుర్స్.. ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఫ్లిప్‌కార్ట్‌లో SBI క్రెడిట్ కార్డులతో 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అలాగే రూ. లక్ష వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది. ముఖ్యంగా ఐఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై వర్తిస్తాయి. విజయ్ సేల్స్‌లో HDFCపై 7.5శాతం డిస్కౌంట్ (రూ.7,500 వరకు), అమెక్స్‌పై (5శాతం) రూ. 20వేల వరకు, HSBCపై రూ.12వేల వరకు, OneCardపై రూ. 20,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, అప్లయెన్సులకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో SBI కార్డుదారులకు బంపర్ ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఖరీదైన స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ వంటి ప్రొడక్టులపై ఈ డిస్కౌంట్ నేరుగా తగ్గింపు అందిస్తుంది. అయితే, ప్రొడక్టు, పేమెంట్ టైప్, టాప్ డిస్కౌంట్ లిమిట్ ఎలా ఉందో తప్పనిసరిగా చెక్ చేయాలి.

అమెజాన్‌లో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు :

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో వివిధ కేటగిరీలపై అద్భుతమైన డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అయితే, క్యాష్‌బ్యాక్ శాతం మాత్రమే కాదు.. ప్రొడక్టు ధర, ఇతర బ్యాంక్ ఆఫర్లతో ఫైనల్ ధర ఎంతో చూడాలి.

విజయ్ సేల్స్‌ ఎందుకు మిస్ కావొద్దంటే? :
ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లలో విజయ్ సేల్స్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. HDFC, ICICI, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి క్రెడిట్ కార్డులపై భారీ మొత్తంలో ఇన్ స్టంట్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టీవీలు, ఏసీలు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్ల విషయంలో ఆన్‌లైన్ ధరతో పాటు స్టోర్ ఆఫర్లను కంపేర్ చేసి కొనడమే బెటర్..

అసలైన బెస్ట్ డీల్ ఏంటి? :
ఈ మూడు ప్లాట్‌ఫారాల్లో ఏది బెస్ట్ డీల్ అంటే చెప్పలేం.. కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్బీఐ కార్డుతో ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అమెజాన్‌లో క్యాష్‌బ్యాక్, విజయ్ సేల్స్‌లో హై వాల్యూ ఎలక్ట్రానిక్స్ డిస్కౌంట్, కొనుగోలు చేసే వస్తువు, కార్డు, ఈఎంఐ లేదా ఫుల్ పేమెంట్ బట్టి ఏది బెస్ట్ అనేది చెప్పవచ్చు.

ఎలక్ట్రానిక్స్ కోసం ఆన్‌లైన్ ఆఫర్లను ఆఫ్‌లైన్ ఆఫర్‌లతో కంపేర్ చేసి చూడండి. విజయ్ సేల్స్ గ్రాండ్ ఎలక్ట్రానిక్స్ సేల్, HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 15వేల వరకు, ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ. 12,500 వరకు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌లపై రూ. 20వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను అందిస్తోంది. అందుకే సేల్ ప్రారంభమయ్యే ముందు ధరను చెక్ చేసుకోవడం బెటర్. డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్, డెలివరీ ఛార్జీలు, ఈఎంఐ అన్నీ కలిపి ఫైనల్ ధర ఎంతో చెక్ చేయండి.