Apple Days Sale : పండగ చేస్కోండి.. ఆపిల్ డేస్ సేల్ ఆఫర్లు.. ఈ ఐఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

Apple Days Sale: కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారాా? ఐఫోన్ 16, ఐఫోన్ 16ప్లస్, ఐఫోన్ 15, ఐఫోన్ 16ఇ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

1/7
Apple Days Sale: కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ 2026 సేల్‌ ఏప్రిల్ 11న మొదలైంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 15, ఐఫోన్ ఎయిర్‌తో సహా మొత్తం ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
2/7
ఈ సేల్ 16 నగరాల్లో 160కి పైగా రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది
3/7
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ధర ఎంతంటే? : ఆపిల్ ఐఫోన్ 16 (128GB) అసలు ధర రూ. 69,900 కాగా, ఈ సేల్‌లో రూ. 66,490కే అందిస్తున్నారు.
4/7
ఫిజికల్ స్టోర్లలో యాక్సిస్, ఐసీఐసీఐ లేదా ఎస్‌బీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలుదారులు రూ. 2వేల వరకు అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ పొందవచ్చు. అసలు ధర రూ. 64,490కి తగ్గుతుంది.
5/7
ఎంపిక చేసిన ఐఫోన్లపై రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. రూ. 79,900 ధరలో ఐఫోన్ 16 ప్లస్ (128GB) ఇప్పుడు రూ. 73,490కి లభిస్తోంది. స్టోర్లలో ఇదే బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో ధర రూ. 71,490కి తగ్గుతుంది.ఎంపిక చేసిన ఐఫోన్లపై రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. రూ. 79,900 ధరలో ఐఫోన్ 16 ప్లస్ (128GB) ఇప్పుడు రూ. 73,490కి లభిస్తోంది. స్టోర్లలో ఇదే బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో ధర రూ. 71,490కి తగ్గుతుంది.
6/7
ఐఫోన్ 16e ధర తగ్గింపు : ఆపిల్ ఐఫోన్ 16e ప్రారంభ ధర రూ. 59,900 నుంచి ఇప్పుడు రూ. 55,690కి తగ్గింది. పలు బ్యాంక్ ఆఫర్లతో రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా అసలు ధర సుమారు రూ. 53,690కి తగ్గుతుంది. రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రీడీమ్ చేసుకుంటే రూ. 418 విలువైన 418 రివార్డ్ పాయింట్లు కూడా పొందవచ్చు.Days Sale
7/7
ఆపిల్ ఐఫోన్ 15 ధర తగ్గింపు : రూ. 3వేలు ధర తగ్గింపుతో ఆపిల్ ఐఫోన్ 15 రూ. 56,900కే లభిస్తుంది. బ్యాంక్ కార్డులతో రూ. 2వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ రివార్డ్ పాయింట్లు పొందవచ్చు.