Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్ 14పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ.24,999కే కొనుగోలు చేయొచ్చు.. డోంట్ మిస్!

Apple iPhone 14 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14కి అద్భుతమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 36వేలు తగ్గింపు అందిస్తోంది. కేవలం రూ.25వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్ 14పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ.24,999కే కొనుగోలు చేయొచ్చు.. డోంట్ మిస్!

Apple iPhone 14 available at just Rs 24,999 in Flipkart Sale

Apple iPhone 14 Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. గత ఏడాదిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ప్లస్‌తో పాటు రూ. 79,900 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత ఈ ఫోన్ ధర రూ. 10వేల తగ్గింపును అందుకుంది. ఆపిల్ ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో అధికారిక స్టోర్ ధర నుంచి రూ. 8,901 తగ్గింపుతో రూ. 60,999కి జాబితా చేసింది.

Read Also : Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై రూ.36వేలు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

బ్యాంకు, కార్డులపై రూ. 1500 తగ్గింపు :
కొనుగోలుదారులు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1500 తగ్గింపును పొందవచ్చు. దీని ద్వారా ఆపిల్ ఐఫోన్ 14 ధర రూ. 59,499కి తగ్గింది. దాంతో పాటు మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఫ్లిప్‌కార్ట్ రూ. 34,500 వరకు తగ్గింపును అందిస్తోంది. అన్ని ఆఫర్లు, తగ్గింపులతో ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 24,999 వద్ద ఐఫోన్ 14ని పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 14 అనేది కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్‌ కన్నా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భారీ ఆదరణ పొందింది. పండుగ సీజన్‌లో ఈ ఐఫోన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఫ్లిప్‌కార్ట్ సేల్ ముగిసినప్పటికీ కూడా ఐఫోన్ 14 ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Apple iPhone 14 available at just Rs 24,999 in Flipkart Sale

Apple iPhone 14 in Flipkart Sale

ఐఫోన్ 14, ఐఫోన్ 13 మాదిరిగా సారూప్యమైన చిప్‌సెట్‌తో ఆధారితమైనది. వీడియో కాల్స్, సెల్ఫీలకు 12ఎంపీ కెమెరాను కలిగిన ఐఫోన్ 13 వంటి నాచ్‌తో ఫ్రంట్ సైడ్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

బ్యాక్ సైడ్ ఐఫోన్ 12ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13తో ఉన్న సారూప్యతల కారణంగా లాంచ్ అయిన వెంటనే పెద్దగా ఆదరణ పొందలేదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ విక్రయాలలో డిస్కౌంట్ పొందిన తర్వాత ఐఫోన్ 14 కొనుగోలుదారుల నుంచి కొంత దృష్టిని ఆకర్షించింది.

Read Also : Realme Christmas Sale : అమెజాన్‌లో రియల్‌మి క్రిస్మస్ సేల్.. ఈ నార్జో స్మార్ట్‌ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!