Apple iPhone 14 Discount : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?

Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. అదనపు బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లతో డివైజ్ రూ. 40వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.

Apple iPhone 14 Discount : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?

Apple iPhone 14 available under Rs 60k on Flipkart, should you buy

Apple iPhone 14 : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 14పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కొత్త ఆఫర్‌ను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో పొందవచ్చు. ఐఫోన్ 14ని రూ. 60వేల లోపు ధరకు విక్రయిస్తోంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో మీరు ఈ డివైజ్‌‌ను రూ. 40వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు.

Read Also : Apple iPhone 14 Sale : రూ.60వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 రూ. 58,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గతంలో రూ.65,999కి విక్రయించింది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ట్రేడింగ్ చేయడానికి ఐఫోన్ 13ని కలిగి ఉంటే.. రూ. 30వేల వరకు తగ్గింపు పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్ అయితే.. అదనంగా 5 శాతం తగ్గింపు పొందవచ్చు. మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి లేటెస్ట్ ఐఫోన్ మోడల్‌లో గణనీయమైన సేవింగ్స్ పొందడానికి ఇదే సరైన సమయం.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ ఐఫోన్ 14 పవర్‌ఫుల్ ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్. స్లిమ్ బార్డర్‌లతో అద్భుతమైన 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే వైడ్ రేంజ్ కలర్లను కలిగి ఉంది. హెచ్‌డీఆర్ కంటెంట్‌కు సపోర్టు ఇస్తుంది. 1200-నిట్ బ్రైట్‌నెస్ ఫొటోలను అందిస్తుంది. సేఫ్ అన్‌లాకింగ్ కోసం ఫేస్ ఐడిని కూడా కలిగి ఉంది. హుడ్ కింద.. ఐఫోన్ 14 ఎ15 బయోనిక్ చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. మీరు 128జీబీ, 256జీబీ లేదా 512జీబీ వంటి విభిన్న స్టోరేజీ ఆప్షన్లతో పొందవచ్చు. సరికొత్త ఐఓఎస్ 16లో రన్ అవుతుంది.

Apple iPhone 14 available under Rs 60k on Flipkart, should you buy

Apple iPhone 14 Flipkart 

కనెక్టివిటీ విషయానికి వస్తే.. వేగవంతమైన ఇంటర్నెట్ 5జీకి సపోర్టు ఇస్తుంది. అలాగే వై-ఫై, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్, ఛార్జింగ్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం లైట్నింగ్ పోర్ట్‌కు సపోర్టు ఇస్తుంది. ఫోటోగ్రఫీ పరంగా.. ఐఫోన్ 14 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన 12ఎంపీ కెమెరా తక్కువ కాంతిలో కూడా ఆకర్షణీయమైన ఫొటోలను తీస్తుంది. వైడ్ రేంజ్ షాట్‌లకు 12ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంది. మెరుగైన డైనమిక్ పరిధికి డాల్బీ విజన్‌తో హై-క్వాలిటీ వీడియోలను కూడా రికార్డ్ చేయగలదు.

Read Also : Apple iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో సిరీస్ డిజైన్, స్పెషిఫికేషన్ల వివరాలు లీక్.. పూర్తి వివరాలు మీకోసం..!