Apple iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో సిరీస్ డిజైన్, స్పెషిఫికేషన్ల వివరాలు లీక్.. పూర్తి వివరాలు మీకోసం..!

Apple iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ అధికారికంగా లాంచ్ అయ్యేందుకు ఇంకా కొద్ది నెలల సమయం ఉన్నప్పటికీ, డివైజ్ స్పెసిఫికేషన్‌లు, డిజైన్ గురించి చాలా వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Apple iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో సిరీస్ డిజైన్, స్పెషిఫికేషన్ల వివరాలు లీక్.. పూర్తి వివరాలు మీకోసం..!

Apple iPhone 16 Pro and 16 Pro Max design details leaked

Apple iPhone 16 Pro Launch : ఈ ఏడాదిలో రానున్న అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లలో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఒకటి. ప్రతి ఏడాదిలో కుపర్టినో దిగ్గజం సంప్రదాయం ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త 2024 ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌లను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 16 లాంచ్‌కు సంబంధించి లీక్‌లు, ఊహాగానాలు ఇప్పటికే బయటకు వచ్చాయి.

కొద్ది రోజుల క్రితమే ఐఫోన్ 16 ప్రో మోడల్‌ల గురించి కొన్ని ముఖ్యమైన డిజైన్ వివరాలు కూడా లీక్ అయ్యాయి. 2023లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే.. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ పెద్ద డిస్‌ప్లేలు, పెద్ద బ్యాటరీలను కలిగి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

భారీ స్ర్కీన్, డిజైన్, డిస్‌ప్లే, కొత్త క్యాప్చర్ బటన్ :
ఇటీవలి నివేదిక ప్రకారం.. రాబోయే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వరుసగా 6.3 అంగుళాలు, 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. ఐఫోన్ 16 ప్రో 6.27-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా. అయితే ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.85-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై న్యూ ఇయర్ డిస్కౌంట్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధర ఎంతంటే?

రాబోయే ఐఫోన్‌లు గత మోడళ్లతో పోలిస్తే.. డివైజ్ ఎత్తు, వెడల్పు పరంగా కొంచెం పెద్ద కొలతలు కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఈ డివైజ్‌లు మరింత పెద్ద పరిమాణంలో ఉండనున్నాయి. ఈ ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో బ్యాటరీలను అందించనుంది. పెద్ద డిస్‌ప్లేలతో పాటు ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లలో కొత్త క్యాప్చర్ బటన్‌ను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

Apple iPhone 16 Pro and 16 Pro Max design details leaked

Apple iPhone 16 Pro and 16 Pro Max design 

హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌ను కలిగి ఉంటుంది. ఎలాంటి ఫిజికల్ మూమెంట్ లేకుండా తాకినప్పుడు టచ్ ద్వారా రెస్పాండ్ అవుతుంది. నివేదిక ప్రకారం.. క్యాప్చర్ బటన్ యూజర్ల కోసం వీడియో రికార్డింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. వీడియో రికార్డింగ్‌ను తక్షణమే ఎనేబుల్ చేసి మొత్తం విధానాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఈ ఐఫోన్ ప్రోటోటైప్ క్యాప్చర్ బటన్ డివైజ్ కుడి వైపున ఉండవచ్చని సూచించింది. ఇంకా, బటన్ ప్రెజర్ ఆధారంగా విభిన్న విధులను నిర్వహిస్తుంది. ఉదాహరణకు.. సింపుల్ టచ్ ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. అయితే, ప్రెస్ వీడియో రికార్డింగ్‌ను కూడా ఎనేబుల్ చేయొచ్చు.

ఐఫోన్ 16 ప్రో కెమెరా స్పెషిఫికేషన్లు (అంచనా) :
అదనంగా, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు కొత్త ఎ18 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తాయి. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు కొత్త ‘టెట్రా-ప్రిజం’ టెలిఫోటో లెన్స్‌తో వస్తాయని నివేదికలు సూచిస్తున్నాయి. మెరుగైన క్లోజప్ షాట్‌ల కోసం 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. ఐఫోన్‌లు 48ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉండవచ్చు. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలో ప్రస్తుత 12ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ కన్నా చాలా మెరుగుపడుతుంది. ఐఫోన్ 16 సిరీస్ అధికారికంగా లాంచ్ అయ్యేందుకు మరికొన్ని నెలల సమయం ఉంది. అప్పటివరకూ ఆగాల్సిందే..

Read Also : iQOO Neo 9 Pro Launch : భారత్‌కు త్వరలో ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?