×
Ad

Apple iPhone 15 Price : సూపర్ ఆఫర్ భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 15 అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇంత తక్కువకు మళ్లీ దొరకదు..!

Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 కొనుగోలు చేశారా? అమెజాన్ దీపావళి సేల్ సందర్భంగా ఐఫోన్ 15 సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. అది ఎలాగంటే?

1/6
Apple iPhone 15 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఐఫోన్ 15పై అదిరిపోయే డిస్కౌంట్.. అమెజాన్ దీపావళి పండగ సేల్ సందర్భంగా భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఐఫోన్ 15 మోడల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు అద్భుతమైన ప్రాసెసర్‌ కలిగి ఉంది. మీరు ఐఫోన్‌ తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో ఐఫోన్ 15 తగ్గింపుతో లభిస్తుంది. ఇంతకీ ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
2/6
ఆపిల్ ఐఫోన్ 15 అమెజాన్ దీపావళి డీల్ : ఆపిల్ ఐఫోన్ 15 అసలు ధర రూ.79,900 ఉండగా అమెజాన్‌లో రూ.47,999 ధరకు లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా వినియోగదారులు ఈ ఐఫోన్‌పై అదనంగా రూ.1,450 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో, పింక్ అనే 5 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మీకు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ లేకపోతే అందుబాటులో ఉన్న ఇతర ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
3/6
ఆపిల్ ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. ప్యానెల్ సిరామిక్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
4/6
86.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. ఈ ఫోన్ ఆపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో ఆపిల్ A16 బయోనిక్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. బేస్ వేరియంట్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగి ఉంది.
5/6
ఆప్టిక్స్ పరంగా ఆపిల్ ఐఫోన్ 15 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి.
6/6
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్‌ కూడా కలిగి ఉంది. 3349mAh బ్యాటరీతో పాటు 15W వైర్‌లెస్ మ్యాగ్‌సేఫ్, Qi2 ఛార్జింగ్ సపోర్ట్‌తో రన్ అవుతుంది.