Apple iPhone 15 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపును అందిస్తుంది. అమెజాన్‌లో రూ. 72వేల కన్నా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Apple iPhone 15 gets massive discount, available on Amazon for less than Rs 72k
Apple iPhone 15 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంటే.. రూ.74,900 భారీ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. వాస్తవానికి భారత మార్కెట్లో ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ ధర రూ.79,900కు ప్రకటించింది. అంటే వినియోగదారులు ఎలాంటి షరతులు లేకుండా రూ. 5వేలు తగ్గింపును పొందవచ్చు. కానీ, మీరు దీన్ని రూ.72వేల లోపే కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఫోన్ 15 మునుపటి మోడల్ కన్నా పెద్ద అప్‌గ్రేడ్‌లను పొందింది. అనేక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డిస్కౌంట్ రేట్లలో కూడా విక్రయిస్తోంది. ఐఫోన్ 15 ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఫ్లాట్ డిస్కౌంట్లను పొందడం చాలా కష్టమని చెప్పవచ్చు. బ్యాంక్ ఆఫర్ కూడా పొందవచ్చు. భారత మార్కెట్లో కొత్త ఐఫోన్ 15ని రూ.72వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తివివరాలను ఓసారి లుక్కేయండి.
రూ. 72వేల కన్నా తక్కువ ధరకు డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 15 రూ.74,900 ప్రారంభ ధరతో అందిస్తుంది. ఎందుకంటే.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను భారత మార్కెట్లో రూ.79,900కు లాంచ్ కాగా.. వినియోగదారులు ఎలాంటి షరతులు లేకుండా రూ. 5వేల తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 15 అన్ని కలర్ మోడల్‌లలో లేటెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అమెజాన్ పే ఐసీసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉంటే.. మీరు రూ. 3,745 అదనపు తగ్గింపు ఆఫర్‌ను పొందవచ్చు.

Apple iPhone 15 massive discount
ఈ బ్యాంక్ ఆఫర్ అమెజాన్ మొబైల్ వెర్షన్‌లో పొందవచ్చు. ఈ ఆఫర్‌ను పొందే వారు అమెజాన్ ద్వారా ఐఫోన్ 15ని రూ. 71,155కి కొనుగోలు చేయొచ్చు. మీ వద్ద ఈ కార్డ్ లేకపోతే.. అమెజాన్ పే యాప్ ద్వారా ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేటెస్ట్ ఐఫోన్‌పై ఈ తగ్గింపును పొందవచ్చు. ఇప్పటివరకు ఐఫోన్ 15పై అత్యల్ప తగ్గింపు ఆఫర్ ఇదే. ఈ బెస్ట్ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
అతి తక్కువ ధరకే ఐఫోన్ 15.. ఎందుకు కొనుగోలు చేయాలంటే? :
ఆపిల్ ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 13తో పోలిస్తే.. ఐఫోన్ 15 చాలా మెరుగైన కెమెరాను కలిగి ఉంది. ఫొటోగ్రఫీ కూడా చాలా ఆకర్షణీయంగా అందిస్తుంది. మీరు ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలో కనిపించే కొత్త డిజైన్‌ను కూడా పొందవచ్చు. ఐఫోన్ 14తో పోల్చితే.. కొత్త ఐఫోన్ మరింత శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 20డబ్ల్యూ స్లో ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. అయితే, ఐఫోన్ యూజర్లు వేగవంతమైన ఛార్జింగ్ అందించవచ్చు. బ్యాటరీ ఆప్టిమైజ్ అయితే.. ప్లస్ లేదా మాక్స్ మోడల్‌లో ఉన్నంత పెద్ద బ్యాటరీని పొందలేరు. ఐఫోన్ ప్రియులకు, అభిమానులకు ఐఫోన్ 15 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.