Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!
Apple iPhone 16 : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Apple iPhone 16
Apple iPhone 16 : ఆపిల్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ 16 మోడల్ ధర అమాంతం తగ్గింది. గత ఏడాది అక్టోబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయింది. స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఆపిల్ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. మీరు ఐఫోన్ 16 కొనాలని చూస్తుంటే.. ఇదే బెస్ట్ టైమ్..
ప్రస్తుతం, మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.26వేల వరకు తగ్గింపుతో ఐఫోన్ 16ను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ ప్రియులు అమెజాన్‌లో రూ.79,900 ధర ఉన్న ఐఫోన్ 16 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్ 16 (128GB) మోడల్‌ను అసలు ధర కన్నా చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 16 (128GB)పై డిస్కౌంట్ ఆఫర్ :
ఆపిల్ ఐఫోన్ 16 128GB స్టోరేజీ అమెజాన్‌లో రూ.79,900 ధరకు లిస్టు అయింది. పాపులారిటీ కారణంగా ఈ ఐఫోన్ 16 ధర 9 శాతం మేర తగ్గింది. ఐఫోన్ కొనుగోలుదారులు ఫ్లాట్ డిస్కౌంట్ ద్వారా కేవలం రూ.72,900కే ఐఫోన్ 16 కొనుగోలు చేయవచ్చు.
ఫ్లాట్ డిస్కౌంట్ సహా అమెజాన్ ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా అందిస్తోంది. ఈ ప్రీమియం ఫోన్‌ను దాదాపు సగం ధరకే పొందవచ్చు. ప్రత్యేకంగా, అమెజాన్ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 4వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
ఐఫోన్ కస్టమర్లు రూ.27,350 వరకు డిస్కౌంట్లను పొందచ్చు. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ తగ్గింపు అందిస్తోంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీరు రూ.15వేలు ఆదా చేస్తే.. ఐఫోన్ 16 రూ.53,900 కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. మరో మాటలో చెప్పాలంటే.. మీరు ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను పూర్తిగా వాడితే మీరు ఐఫోన్ 16 సగం కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే.. కేవలం రూ. 53,900కు కొనేసుకోవచ్చు.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 అల్యూమినియం ఫ్రేమ్, ఆకర్షణీయమైన గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో వస్తుంది. నీటిలో పడినా పాడైపోదు. ఈ ఐఫోన్ అద్భుతమైన 6.1-అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. అద్భుతమైన విజువల్స్ కోసం (XDR OLED) ప్యానెల్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం ఆపిల్ సిరామిక్ షీల్డ్ గ్లాస్‌ను చేర్చింది.
Read Also : Apple Watch : అదిరిందయ్యా Apple.. వాచ్‌కే కెమెరా, AI కూడా.. ఎప్పుడు వస్తుందంటే..?
iOS 18 రన్ అయ్యే ఐఫోన్ 16 ఆపిల్ A18 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. 8GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇందులో 48MP + 12MP సెన్సార్లతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఆపిల్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 3561mAh బ్యాటరీని కలిగి ఉంది.