AC Safety Tips : బిగ్ అలర్ట్.. వేసవిలో ఏసీలు పేలుతున్నాయి జాగ్రత్త.. మీ AC ఏదైనా ఈ మిస్టేక్స్ పొరపాటున కూడా చేయొద్దు..!

AC Safety Tips : వేసవిలో ఎయిర్ కండిషనర్లు తెగ వాడేస్తుంటారు. వేడిగా ఉందని ఏసీ ఆన్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటో ఓసారి లుక్కేయండి.

AC Safety Tips : బిగ్ అలర్ట్.. వేసవిలో ఏసీలు పేలుతున్నాయి జాగ్రత్త.. మీ AC ఏదైనా ఈ మిస్టేక్స్ పొరపాటున కూడా చేయొద్దు..!

AC Safety Tips

Updated On : March 24, 2025 / 2:14 PM IST

AC Safety Tips : వేసవి వచ్చేసింది. ఎండల తీవ్రత కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. చాలామంది ఏసీలను వాడుతుంటారు. కొంతమంది పాత ఏసీలనే వాడేస్తారు. మరికొంతమంది మాత్రం కొత్త ఏసీలను కొనేందుకు ఆసక్తిచూపిస్తుంటారు. మీరు ఏ ఏసీని వాడినా సరే ముందుగా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి.

Read Also : Jio Offer : పండగ చేస్కోండి.. జియో బంపర్ ఆఫర్.. ఈ సింగిల్ ప్లాన్‌తో హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!

కొన్నిసార్లు మీ చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. ఇటీవల, హర్యానాలో జరిగిన ఒక విషాద సంఘటన ఇందుకు ఉదాహరణ. ఏసీ ఆన్ చేసిన వెంటనే పెద్ద శబ్దంతో పేలి ఒకే ఇంట్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఎయిర్ కండిషనర్‌ను ఆన్ చేసే ముందు తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

విద్యుత్ కనెక్షన్లను చెక్ చేయండి : అన్ని విద్యుత్ జాయింట్లు సరిగానే ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లూజుగా ఉండే కనెక్షన్లు షార్ట్ సర్క్యూట్లకు, పేలుడుకు దారితీయవచ్చు.

యూనిట్‌కు సర్వీసింగ్ చేయండి : చాలా మంది నెలల తరబడి ఏసీ ఆన్ చేయరు. ఆ తర్వాత కవర్‌ తీసి ఏసీని స్టార్ట్ చేస్తారు. ఇలా పొరపాటున కూడా చేయొద్దు. ప్రతిదీ చెక్ చేసుకున్నాకే ఏసీని ఆన్ చేయాలి. లేదంటే వాడే ముందు ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవడం మంచిది.

గ్యాస్ లీకేజీలు చెక్ చేయండి : స్ప్లిట్ లేదా విండో AC యూనిట్లను ఉపయోగించే ముందు, ఏవైనా గ్యాస్ లీకేజీలు ఉన్నాయా లేదో చెక్ చేయండి. ఇలాంటి గ్యాస్ లీకేజీ ద్వారా మీ ఏసీ కూలింగ్ కెపాసిటీ గణనీయంగా తగ్గుతుంది.

టర్బో మోడ్‌ ఆన్ చేయండి : మీ ఏసీపై అదనంగా ప్రెజర్ పడేలా చేయొద్దు. టర్బో మోడ్‌ను ఉపయోగించుకోండి. గదిలో టెంపరేచర్ తగ్గిన తర్వాత ఏసీని సాధారణ స్పీడ్‌‌కు మార్చండి.

Read Also : BSNL Offer : BSNL ఫ్యామిలీ ప్లాన్ అదిరిందిగా.. సింగిల్ రీఛార్జ్‌తో 3 సిమ్ కార్డుల్లో ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటా.. పోలే.. అదిరిపోలే..!

ఎక్కువగా ఏసీ వాడొద్దు : ఎక్కువ గంటలు ఏసీని వాడొద్దు. ఇలా చేస్తే ఏసీ తొందరగా వేడెక్కడం వంటి సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించే ప్రమాదం ఉంటుంది.

విద్యుత్తు హెచ్చుతగ్గులు : మీ ప్రాంతంలో తరచుగా విద్యుత్తు హెచ్చుతగ్గులు ఉంటే.. మీ ఏసీ కోసం మంచి స్టెబిలైజర్‌ను కొనుగోలు చేయండి. విద్యుత్ హై ఓల్టేజ్ వచ్చినా ఏసీ దెబ్బతినకుండా ఉంటుంది.
ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా ఈ వేసవిలో మీ ఎయిర్ కండిషనర్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.