BSNL Offer : BSNL ఫ్యామిలీ ప్లాన్ అదిరిందిగా.. సింగిల్ రీఛార్జ్‌తో 3 సిమ్ కార్డుల్లో ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటా.. పోలే.. అదిరిపోలే..!
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ ఆఫర్ అదిరింది.. సింగిల్ రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏకంగా 3 సిమ్ కార్డుల్లో ఉచితంగా ఫోన్ కాల్స్, హైస్పీడ్ డేటా కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ ఫుల్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

BSNL recharge offers
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. దేశీయ ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అత్యంత పోటీతత్వ టెలికాం ప్రపంచంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు పోటీగా BSNL ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది.
కస్టమర్ బేస్ పెంచుకునేందుకు ప్రైవేట్ టెలికం కంపెనీలతో BSNL గట్టి పోటీని ఇస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL ఈ అద్భుతమైన కొత్త ప్లాన్ పోస్టు పెయిడ్ యూజర్ల కోసం ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు ఒకే రీఛార్జ్ కింద మూడు సిమ్ కార్డుల్లో ఉచితంగా కాల్స్, హైస్పీడ్ డేటాను పొందవచ్చు.
బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ఆప్షన్ల కోసమే BSNL ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం టెలికం కంపెనీ వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తోంది. అయితే, కస్టమర్లు తమ అదనపు సిమ్ కార్డుల కోసం రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఆకర్షణీయమైన కొత్త ప్లాన్ వివరాలను BSNL అధికారిక పోస్ట్ (X) ద్వారా వెల్లడించింది. ఆసక్తిగల కస్టమర్లు BSNL వెబ్‌సైట్ లేదా BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా ఈ ప్లాన్‌ను యాక్సెస్ చేయవచ్చు.
రూ. 999 ధరకు BSNL ఫ్యామిలీ ప్లాన్ ప్రత్యేకంగా పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం రూపొందించింది. ఈ ప్లాన్ స్పెషల్ ఫీచర్ ఏమిటంటే.. ఒక వ్యక్తి రీఛార్జ్ చేసుకోవాలి. ఆ రీఛార్జ్ మరో రెండు సిమ్ కనెక్షన్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం ముగ్గురు కుటుంబ సభ్యులు ఒకే ధరకు ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. దాంతో ఎవరికి వారు వేరుగా రీఛార్జ్ ప్లాన్‌లపై ఆదారపడాల్సిన అవసరం ఉండదు.
ఈ ఫ్యామిలీ ప్లాన్ బెనిఫిట్స్ విషయానికొస్తే.. ప్రైమరీ యూజర్లకు మాత్రమే కాకుండా కనెక్ట్ చేసిన ఇతర ఫోన్ నంబర్లకు కూడా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌ను అందిస్తుంది. ప్రతి యూజర్ మొత్తం 75GB డేటాను పొందవచ్చు. ముగ్గురు యూజర్లకు 300GB మొత్తం పొందవచ్చు. అదనంగా, ఈ ప్లాన్‌లో ప్రతి యూజర్‌కు రోజుకు 100 ఫ్రీ SMSలు ఉంటాయి. రీఛార్జ్ ఖర్చులను ఆదా చేసే వారికి అద్భుతమైన ప్యాకేజీగా చెప్పవచ్చు.