iPhone 16 Plus : ఐఫోన్ క్రేజే వేరబ్బా.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర ఎంతో తెలిస్తే ఎగబడి కొనేస్తారు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర తగ్గింది.. ఈ ప్లాట్‌ఫారంలో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఐఫోన్ 16 ప్లస్ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published On : November 15, 2025 / 04:08 PM IST
iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ సరసమైన ధరకే లభిస్తోంది. గత జనరేషన్ మోడల్ రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయమైన ధరకే అందుబాటులో ఉంది.
భారత మార్కెట్లో రూ. 89,900 ధరకు లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్లస్ ప్రీమియం డిజైన్, డ్యూయల్-కెమెరా సెటప్ మొత్తం పర్ఫార్మెన్స్ సహా అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఇటీవలి ధర తగ్గుదలతో కస్టమర్‌లు ఇప్పుడు ఈ ఐఫోన్ 16 ప్లస్ రూ. 68వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు పాత ఫోన్ అప్‌గ్రేడ్ ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు..
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ.89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రూ.67,990కి లిస్ట్ అయింది. రూ.12,910 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు HSBC క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలతో రూ.7,500 వరకు 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. హుడ్ కింద, ఈ ఐఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 16 ప్లస్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని టెక్ దిగ్గజం పేర్కొంది. ఐఫోన్ 16 ప్లస్ IP68 రేటింగ్‌తో వస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్లస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కలిగి ఉంది.
