iPhone 16 Price : కొత్త ఐఫోన్ కావాలా? అతి తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 16 కొనేసుకోండి.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు..!

iPhone 16 Price : ఐఫోన్ 16 ధర తగ్గింది.. విజయ్ సేల్స్ ఈ ఐఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ. 11,900కు పైగా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.. ఈ డీల్ మీకోసమే..

iPhone 16 Price : కొత్త ఐఫోన్ కావాలా? అతి తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 16 కొనేసుకోండి.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు..!

iPhone 16 Price

Updated On : July 8, 2025 / 2:07 PM IST

iPhone 16 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. ఇదే బెస్ట్ టైమ్.. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 రూ.11,900కు పైగా తగ్గింది. మీ పాత ఫోన్ (iPhone 16 Price) అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇంకా తక్కువ ధరకే కొత్త ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఆపిల్ ఐఫోన్ 16 డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 రూ.79,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ రూ.71,990కి లిస్ట్ అయింది. రిటైలర్ ఐఫోన్ 16పై రూ.7,910 ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ. 11,900కు పైగా తగ్గింపు పొందవచ్చు.

Read Also : SCSS Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. సీనియర్ సిటిజన్లు ఒకేసారి పెట్టుబడి పెడితే.. కేవలం వడ్డీనే రూ. 82వేలు సంపాదించుకోవచ్చు..!

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 60hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED ప్యానెల్, 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఈ డిస్‌‌ప్లే HDR డిస్‌ప్లే, ట్రూ టోన్‌కు సపోర్టు ఇస్తుంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్ కోటింగ్‌ను కలిగి ఉంది. హుడ్ కింద ఐఫోన్ 16 A18 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది.

ఈ ఫోన్ 22 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా కలిగి ఉంది. ఐఫోన్ 16 మోడల్ IP68 సర్టిఫికేట్ పొందింది. ఆప్టిక్స్ పరంగా ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 48MP ఫ్యూజన్ సెన్సార్‌తో పాటు 2x ఆప్టికల్ జూమ్‌తో పాటు 12MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కలిగి ఉంది.