SCSS Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. సీనియర్ సిటిజన్లు ఒకేసారి పెట్టుబడి పెడితే.. కేవలం వడ్డీనే రూ. 82వేలు సంపాదించుకోవచ్చు..!

SCSS Scheme : పోస్టాఫీసులో సీనియర్ సీటిజన్ల కోసం అద్భుతమైన పథకం.. SCSS స్కీమ్ ద్వారా కేవలం వడ్డీతోనే రూ. 82వేలు సంపాదించుకోవచ్చు.

SCSS Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. సీనియర్ సిటిజన్లు ఒకేసారి పెట్టుబడి పెడితే.. కేవలం వడ్డీనే రూ. 82వేలు సంపాదించుకోవచ్చు..!

Post Office Scheme

Updated On : July 8, 2025 / 1:41 PM IST

SCSS Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? ఏయే పథకాల్లో పెట్టుబడి పెడితే ఎంత సంపాదించుకోవచ్చో తెలుసా? చాలామంది సంపాదించిన డబ్బును (SCSS Scheme) సేవింగ్ చేయడం కన్నా ఖర్చు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు ఇల్లు కొనడం లేదా కారు కొనేందుకు చూస్తుంటారు.

ఇందుకు భారీ మొత్తంలో డబ్బులు అవసరం. కేవలం మీ నెలవారీ జీతంతో కొనుగోలు చేయలేరు. ఇలాంటి పరిస్థితిలో కొంతమంది భవిష్యత్తు కోసం మ్యూచువల్ ఫండ్లలో SIP ప్లాన్లలో పెట్టుబడి పెడుతుంటారు. ఇందులో రిస్క్ ఉంటుందని కొంతమంది పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపరు. ఎలాంటి రిస్క్ లేకుండా భారీ మొత్తంలో సంపాదించే ప్రభుత్వ పథకాల్లో పోస్టాఫీసు పథకాలు చాలా బెస్ట్..

ఇలాంటి వారికి ప్రభుత్వ పథకాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ కింద పెట్టుబడులు పెట్టవచ్చు. మీ సమీపంలోని పోస్టాఫీసులో ఈజీగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ Senior Citizen Saving Scheme (SCSS) ద్వారా కేవలం వడ్డీ ద్వారా మాత్రమే అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. మీరు 5 ఏళ్లకు ఒకేసారి పెట్టుబడి పెడితే.. వడ్డీ ద్వారా మాత్రమే రూ. 82 వేలకు పైగా సంపాదించవచ్చు. ఈ SCSS పథకం గురించి వివరంగా తెలుసుకుందాం..

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ :
పోస్టాఫీసులో అందించే పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) ఒకటి. ఈ పథకం కింద మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసి (Post Office Small Savings Scheme) భారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది ప్రభుత్వం అందించే పథకం. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని మీ తండ్రి లేదా తాత పేరు మీద ఓపెన్ చేయొచ్చు.

ఈ స్కీమ్ 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి అందుబాటులో ఉంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1000 కాగా, గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షలు. ఈ పథకం కింద మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు. అవసరమైతే మరో 3 ఏళ్లు పొడిగించవచ్చు. వడ్డీ విషయానికి వస్తే.. ఈ SCSS పథకం కింద 8.2 శాతం వడ్డీ అవుతుంది. వడ్డీ ప్రతి త్రైమాసిక ప్రాతిపదికన నిర్ణయిస్తారు. వార్షిక ప్రాతిపదికన వడ్డీ జారీ అవుతుంది.

Read Also : Motorola Edge 50 Pro : బిగ్ ఆఫర్ భయ్యా.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

ఎవరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు? :
భారత పౌరుల్లో ఏ సీనియర్ సిటిజన్ అయినా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ సింగిల్, జాయింట్‌గా కూడా ఓపెన్ చేయొచ్చు. 55 ఏళ్లు పైబడిన లేదా 60 ఏళ్లలోపు రిటైర్మెంట్ చేసిన ఉద్యోగులు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన ఒక నెలలోపు పెట్టుబడి పెట్టాలనే షరతు ఉంటుంది. దాంతో పాటు 50 ఏళ్లు పైబడినా లేదా 60 ఏళ్లలోపు రిటైర్మెంట్ అయిన రక్షణ సిబ్బంది కూడా అదే షరతుతో పెట్టుబడి పెట్టవచ్చు.

అకౌంట్ గడువుకు ముందే క్లోజ్ చేస్తే ఏమౌతుంది? :
ఈ పథకం కింద 80C కింద రూ. 1.5 లక్షల వరకు వార్షిక పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది. మీరు అకౌంట్ ముందస్తుగా క్లోజ్ చేస్తే.. కొన్ని ప్రయోజనాలను కోల్పోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ తర్వాత ఎప్పుడైనా గడువు ముగియకుండా క్లోజ్ చేయొచ్చు. ఒక ఏడాది ముందు అకౌంట్ క్లోజ్ చేస్తే.. వడ్డీ రాదు. అకౌంటులో ఏదైనా వడ్డీ చెల్లిస్తే అది ప్రిన్సిపాల్ అమౌంట్ నుంచి వసూలు చేస్తారు.

అలాగే, అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి ఒక ఏడాది తర్వాత లేదా 2 ఏళ్ల ముందు క్లోజ్ చేస్తే.. 1.5శాతం సమానమైన మొత్తం అసలు నుంచి తొలగిస్తారు. అకౌంట్ 2 ఏళ్ల తర్వాత కానీ 5 ఏళ్ల ముందు క్లోజ్ చేస్తే.. ఒక శాతానికి సమానమైన మొత్తం అసలు నుంచి తొలగిస్తారు. ఒకవేళ ఖాతా పొడిగించిన తర్వాత అకౌంట్ పొడిగింపు తేదీ నుంచి ఒక ఏడాది గడువు ముగిసిన తర్వాత ఎలాంటి తగ్గింపు లేకుండా క్లోజ్ చేయొచ్చు.

కేవలం వడ్డీ ద్వారా రూ. 82 వేలు సంపాదన :
ఈ పథకంలో ఎవరైనా ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే.. 5 ఏళ్ల మెచ్యూరిటీ పూర్తి అయ్యాక 8.2 శాతం వడ్డీని పొందవచ్చు. లెక్క ప్రకారం.. కేవలం వడ్డీ ద్వారా మాత్రమే రూ. 82వేలు సంపాదిస్తాడు. మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 2,82,000 అవుతుంది. త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ ఆదాయం రూ. 4,099 అవుతుంది.