iPhone 16 Pro Max : ఇది కదా ఆఫర్.. కొత్త ఐఫోన్ కొనాలంటే ఇప్పుడే కొనేసుకోండి.. ఇలాంటి డిస్కౌంట్ మళ్లీ జన్మలో రాదు..!
iPhone 16 Pro Max : అదిరే ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డిస్కౌంట్ ధరకే వస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

iPhone 16 Pro Max
iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఫోన్ కావాలా? ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. విజయ్ సేల్స్ (iPhone 16 Pro Max) ఈ ఐఫోన్ మోడల్ కొనుగోలుపై ఏకంగా రూ.13,500 వరకు ఆఫర్‌ను అందిస్తోంది.
పాత ఐఫోన్ అప్‌గ్రేడ్ చేయాలన్నా లేదా వేరే బ్రాండ్ నుంచి ఫోన్ కొనాలన్నా ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కోసం చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం..
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 1,35,900కు లిస్ట్ అయింది.
రిటైలర్ స్టోర్‌లో రూ. 9వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐలపై అదనంగా రూ. 4,500 డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (iPhone 16 Pro Max) :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 2,000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ ప్రీమియం ఫోన్ టైటానియం డిజైన్‌ను కలిగి ఉంది. అప్‌గ్రేడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.
హుడ్ కింద ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 3nm A18 ప్రో చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ Genmoji, ఇమేజ్ ప్లేగ్రౌండ్, సిరితో చాట్‌జీపీటీ సపోర్ట్ సహా అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది.
Read Also : Vivo Y400 Pro 5G : వివో లవర్స్‌కు పండగే.. ఈ కొత్త 5G ఫోన్ భలే ఉంది భయ్యా.. ఏఐ ఫీచర్ల కోసమైనా కొనాల్సిందే..!
ఆప్టిక్స్ పరంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.