Vivo Y400 Pro 5G : వివో లవర్స్‌కు పండగే.. ఈ కొత్త 5G ఫోన్ భలే ఉంది భయ్యా.. ఏఐ ఫీచర్ల కోసమైనా కొనాల్సిందే..!
Vivo Y400 Pro 5G : వివో కొత్త 5G ఫోన్ అదుర్స్.. మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్, ఏఐ ఫీచర్లతో మరింతగా ఆకట్టుకుంటోంది..

Vivo Y400 Pro 5G
Vivo Y400 Pro 5G : వివో లవర్స్ కోసం భారత మార్కెట్లోకి కొత్త వివో Y సిరీస్ ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన (Vivo Y400 Pro 5G) ఫీచర్లతో వివో Y400 ప్రో 5G కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది.
ఈ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ 3D కర్వ్డ్ డిస్‌ప్లే, ఏఐ ఫీచర్లతో పాటు డ్యూయల్ కెమెరా సెటప్, బిగ్ బ్యాటరీతో సన్నని డిజైన్ కలిగి ఉంది. ఈ వివో ఫోన్ 7.49mm మందంతో వస్తుంది.
Read Also : Voter ID Card : ఓటర్లకు గుడ్ న్యూస్.. ఇకపై కేవలం 15 రోజుల్లోనే కొత్త ఓటర్ ఐడీ వస్తుంది.. ఫుల్ డిటెయిల్స్..!
జూన్ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఇండియా ఇ-స్ట్రో, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. అలాగే, వివో Y400 ప్రో ఫ్రీస్టైల్ వైట్, నెబ్యులా పర్పుల్, ఫెస్ట్ గోల్డ్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. వివో Y400 ప్రో 5G ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి..
వివో Y400 ప్రో స్పెసిఫికేషన్లు :
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్, HDR10+ సపోర్ట్, 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. మాలి G615 GPUతో మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్ కలిగి ఉంది.
ఈ వివో ఫోన్ 8GB వరకు LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ 50MP సోనీ IMX882 సెన్సార్‌తో పాటు 2MP మాక్రో సెన్సార్‌తో సహా డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఈ వివో ఫోన్ ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఏఐ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ వివో ఏఐ ఫొటో ఎన్‌హాన్స్, ఏఐ ఎరేస్ 2.0 వంటి ఇమేజింగ్ ఫీచర్‌లను అందిస్తుంది. ఏఐ నోట్ అసిస్ట్, స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లను అందిస్తుంది. సర్కిల్ టు సెర్చ్‌ను ఫీచర్ కూడా ఉంది.
వివో V400 ప్రో 5G ధర, ఆఫర్లు :
వివో V400 ప్రో 5G ఫోన్ (Vivo Y400 Pro 5G) 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999కు పొందవచ్చు. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999కు కొనుగోలు చేయొచ్చు.
ఎస్బీఐ, డీబీఎస్, ఐడీఎఫ్‌సీ, యస్ బ్యాంక్ లేదా (BOBCARD) బ్యాంకుల ద్వారా కస్టమర్లు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కస్టమర్లు TWS 3e ANC రూ.1,499కు కొనుగోలు చేయొచ్చు.