SBI UPI QR Code : SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై డెబిట్ కార్డుతో పనిలేదు.. UPI QR కోడ్‌తో క్యాష్ విత్‌డ్రా చేయొచ్చు!
SBI UPI QR Code : ఎస్బీఐ కస్టమర్లు ఇకపై డెబిట్ కార్డు లేకుండానే యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.

SBI UPI QR Code
SBI UPI QR Code : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఎస్బీఐ కొత్త సర్వీస్ ప్రారంభించింది. మీరు ఏటీఎం నుంచి క్యాష్ తీసుకోవాలని అనుకుంటున్నారా?
మీ డెబిట్ కార్డు మర్చిపోయినా డోంట్ వర్రీ.. ఇకపై SBI కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా సౌకర్యాన్ని తీసుకొచ్చింది. మీ ఫోన్ ద్వారా ఏటీఎం నుంచి ఈజీగా డబ్బులు తీసుకోవచ్చు.
యూపీఐ QR కోడ్ ద్వారా డెబిట్ కార్డ్ లేకుండా ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేయొచ్చు. కానీ, మీ స్మార్ట్‌ఫోన్, యూపీఐ యాప్ రెండు తప్పనిసరిగా ఉండాలి.
SBI కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా బెనిఫిట్స్ ఏంటి? :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకు 18 జూన్ 2025న ఈ కొత్త సదుపాయాన్ని ప్రకటించింది. ఇందులో వినియోగదారులు ఇప్పుడు ఎలాంటి డెబిట్ కార్డ్ లేకుండా UPI యాప్ ద్వారా ATM నుంచి క్యాష్ తీసుకోవచ్చు.
తద్వారా డిజిటల్ బ్యాంకింగ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎస్బీఐ ఏటీఎం నుంచి యూపీఐ క్యూఆర్ క్యాష్ సౌకర్యాన్ని ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
SBI యూపీఐ QR క్యాష్ సర్వీస్ ఎలా? :
1. ముందుగా UPI QR క్యాష్‌కు సపోర్టు ఇచ్చే ఎస్బీఐ ఏటీఎంకి వెళ్లాలి.
2. ATM స్క్రీన్‌పై ఉన్న UPI QR క్యాష్ ఆప్షన్ ట్యాప్ చేయండి.
3. స్క్రీన్‌పై విత్‌డ్రా చేసే మొత్తాన్ని ఎంటర్ చేయండి.
4. PhonePe, Google Pay, BHIM వంటి UPI సపోర్టు యాప్ ద్వారా ఏటీఎం జనరేట్ QR కోడ్‌ను స్కాన్ చేయండి.
5. మీ UPI యాప్‌లోకి లాగిన్ అయి UPI పిన్‌ను ఎంటర్ చేయండి.
6. ATM స్క్రీన్‌పై Continue బటన్‌ను ట్యాప్ చేయండి.
7. ఏటీఎం నుంచి మీ క్యాష్ విత్‌డ్రా చేసుకోండి.
ఈ షరతులు పాటించాలి :
1. మినిమం క్యాష్ విత్‌డ్రా మొత్తం రూ. 100 ఉండాలి.
2. రోజుకు గరిష్టంగా విత్‌డ్రా మొత్తం రూ. 10 వేలు .
3. రోజుకు గరిష్టంగా 2 లావాదేవీలు మాత్రమే
4. విత్‌డ్రా మొత్తం రూ. 100x(మల్టీపుల్) పైనే ఉండాలి.