Sim Card Rules : సిమ్ కార్డులపై కొత్త రూల్స్.. ఇకపై ఈ పని చేయకుంటే కొత్త సిమ్ కార్డ్ పొందలేరు.. ఫుల్ డిటెయిల్స్..!

Sim Card Rules : కొత్త సిమ్ కార్డు తీసుకునే వారు తప్పనిసరిగా ఈ కొత్త రూల్ పాటించాల్సిందే.. లేదంటే కొత్త సిమ్ కార్డు పొందలేరు.

Sim Card Rules : సిమ్ కార్డులపై కొత్త రూల్స్.. ఇకపై ఈ పని చేయకుంటే కొత్త సిమ్ కార్డ్ పొందలేరు.. ఫుల్ డిటెయిల్స్..!

Sim Card Rules

Updated On : June 19, 2025 / 5:03 PM IST

Sim Card Rules : కొత్త సిమ్ కార్డు తీసుకుంటున్నారా? ఇకపై సిమ్ కార్డు కావాలంటే కేవైసీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇటీవలే భారత ప్రభుత్వం సిమ్ కార్డుల వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది.

మొబైల్ నంబర్లు, బిజినెస్ కాల్స్‌కు కేవైసీ తప్పనిసరి చేసింది. టెలికాం రంగంలో పారదర్శకత, భద్రత, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకోవచ్చు. ఈ కొత్త విధానం ఎలా ఉంటుంది? సిమ్ కార్డు వినియోగదారులు ఏం చేయాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం..

Read Also : Reliance Jio : జియో యూజర్లకు పండగే.. ఈ 3 ప్లాన్లతో 7 రోజుల ఫ్రీ సర్వీస్.. 200GB వరకు ఎక్స్‌ట్రా డేటా, ఫ్రీగా OTT బెనిఫిట్స్..!

కొత్త మార్గదర్శకాలివే :
ప్రభుత్వం ప్రకారం.. ఇప్పుడు ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ అయినా అన్ని మొబైల్ నంబర్‌లకు కేవైసీ ప్రక్రియ తప్పనిసరి. గతంలో, ప్రీపెయిడ్ యూజర్లకు కేవైసీ సౌలభ్యం ఉండేది.

ఇక్కడ పూర్తి కేవైసీ లేకుండా కూడా సిమ్ కార్డులను పొందవచ్చు. కానీ, ఇప్పుడు ఈ ఆప్షన్ ముగిసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. వినియోగదారులు తమ గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్‌తో కేవైసీని పూర్తి చేయాలి.

ఈ ప్రక్రియను ఆఫ్‌లైన్‌లో (టెలికాం స్టోర్లలో) లేదా ఆన్‌లైన్‌లో టెలికాం కంపెనీల వెబ్‌సైట్‌లు లేదా యాప్‌ల ద్వారా పూర్తి చేయవచ్చు.

సేఫ్టీ, ట్రాన్స్‌పరంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. కేవైసీ ఉండటం వల్ల అనేక అక్రమ మార్గాలను నియంత్రించవచ్చు.

అన్ని మొబైల్ నంబర్లు రిజిస్టర్ యూజర్లకు లింక్ అయి ఉంటాయి. అత్యవసర సేవలు, ప్రభుత్వ పథకాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

కొత్త రూల్స్ ఎఫెక్ట్ :
కొత్త విధానం వల్ల ప్రీపెయిడ్ యూజర్లపై భారీ ప్రభావం ఉంటుంది. ఇకపై KYC లేకుండా సిమ్ కార్డులను పొందలేరు. ఈ ప్రక్రియ కొంచెం కష్టంగా ఉంటుంది.

సెక్యూరిటీ పరంగా ఫుల్ సేఫ్టీ ఉంటుంది. ఇప్పటికే KYC పూర్తి చేసిన పోస్ట్‌పెయిడ్ యూజర్లపై తక్కువ ప్రభావం ఉంటుంది. అయితే, ఎప్పటికప్పుడు KYCని కూడా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also : Aadhaar Card : మీ ఆధార్ ఇంకా అప్‌డేట్ చేయలేదా? ఈ 10 గవర్నెంట్ స్కీమ్ బెనిఫిట్స్ కోల్పోతారు జాగ్రత్త.. ఇప్పుడే ఇలా చేయండి..!

KYC ఎలా పూర్తి చేయాలి? :

  • కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు వినియోగదారులు ఈ క్రింది డాక్యుమెంట్లను సమర్పించాలి.
  • ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటరు ఐడీ )
  • అడ్రస్ ప్రూఫ్ (యుటిలిటీ బిల్లు, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్ )
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో ఈ డాక్యుమెంట్లను టెలికాం స్టోర్లలో సమర్పించవచ్చు
  • టెలికాం కంపెనీల వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయొచ్చు.
  • కొన్ని కంపెనీల్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ అవసరం.
  •  భద్రతను మరింత పెంచుకోవచ్చు.