Reliance Jio : జియో యూజర్లకు పండగే.. ఈ 3 ప్లాన్లతో 7 రోజుల ఫ్రీ సర్వీస్.. 200GB వరకు ఎక్స్‌ట్రా డేటా, ఫ్రీగా OTT బెనిఫిట్స్..!

Jio offer
Reliance Jio : రిలయన్స్ జియో యూజర్ల కోసం అదిరిపోయే ప్లాన్లు.. ఈ జియో ప్లాన్లలో 100GB నుంచి 200GB వరకు అదనపు డేటాను ఉచితంగా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్లు 7 రోజుల అదనపు (Reliance Jio) వ్యాలిడిటీని కూడా అందిస్తాయి.
ఈ బెనిఫిట్స్‌తో పాటు, OTT యాప్స్, ఇతర టీవీ ఛానెల్‌లను కూడా యాక్సెస్ చేయొచ్చు. జియో హోమ్ 3 రీఛార్జ్ ప్లాన్‌లతో 100Mbps వరకు స్పీడ్, 1000GB హై-స్పీడ్ డేటాను అందిస్తాయి.
ఈ ప్లాన్లలో 100GB నుంచి 200GB వరకు అదనపు డేటాను ఉచితంగా పొందవచ్చు. 7 రోజుల అదనపు వ్యాలిడిటీతో పాటు OTT యాప్స్, టీవీ ఛానెల్‌లను కూడా యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదు.. హై-స్పీడ్ ఇంటర్నెట్, లాంగ్ వ్యాలిడిటీతో ఎక్కువ డేటా పొందవచ్చు.
జియో హోమ్ రూ.2222 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో కంపెనీ 30Mbps వరకు హైస్పీడ్ అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 3 నెలలు. ఈ ప్లాన్‌లో 7 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు. 1000GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.
100GB అదనపు డేటా, టీవీ ఛానెల్స్, OTT ఫ్రీ :
ఈ జియో హోమ్ ప్లాన్‌లో 100GB అదనపు డేటాతో పాటు 800 కన్నా ఎక్కువ టీవీ ఛానల్స్, 11 OTT యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.
జియో హోమ్ రూ.3333 ప్లాన్ :
ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్, 3 నెలల వ్యాలిడిటీ, 1000GB హై-స్పీడ్ డేటాతో పాటు 150GB అదనపు డేటాను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ 7 రోజుల అదనపు వ్యాలిడిటీతో వస్తుంది.
టీవీ ఛానెల్స్, OTT ఫ్రీ (Reliance Jio) :
ఈ జియో హోమ్ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ ద్వారా 800 కన్నా ఎక్కువ టీవీ ఛానెల్‌లకు ఫ్రీ యాక్సెస్, 11 OTT యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్ వాయిస్ కాలింగ్ కూడా అందిస్తుంది.
జియో హోమ్ రూ.4444 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ 100Mbps వరకు ఉంటుంది. 1000GB హై-స్పీడ్ డేటా, 200GB అదనపు డేటా ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ 3 నెలల పాటు ఉంటుంది. 7 రోజుల అదనపు వ్యాలిడిటీ ఉచితంగా పొందవచ్చు.
ఫ్రీ టీవీ ఛానెల్స్, OTT బెనిఫిట్స్ :
ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్‌తో సహా 800కి పైగా టీవీ ఛానెల్స్, 15 OTT యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.